...

Instagram Silent War : బన్నీ వర్సెస్ విజయ దేవరకొండ.. ఇన్ స్టాలో సైలెంట్ వార్..

Instagram Silent War : హీరోల మధ్య సోషల్‌మీడియాలో కొనసాగే సైలెంట్ వార్ విషయం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి ఫాలోయింగ్ వారిది, ఎవరి ఫ్యాన్స్ వాళ్లకు ఉండటం కామన్. ప్రస్తుతం ఇన్ స్టా.. సెలబ్రెటీలకు ఫెవరేట్‌గా మారింది. అయితే స్టార్స్ మధ్య పాలోవర్స్ విషయంలో కాస్త తేడాలు ఉంటాయి. గతంలో అల్లుఅర్జున్ రికార్డును విజయ్ దేవరకొండ బ్రేక్ చేశాడనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఇన్ స్టాలో ఇద్దరి మధ్య పోటీ నడుస్తుంది.

Advertisement

సౌత్ హీరోలు అందరిలో ఇన్ స్టాలో ఎక్కువగా ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి మూవీకి ముందు పలు మూవీస్‌లో విజయ్ నటించినా.. అంతకు గుర్తింపు రాలేదు. అప్పట్లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అర్జున్ రెడ్డి ఫేమ్.. అతన్ని ఓవర్ నైట్ స్టార్‌ గా మార్చేసింది. ఈ మూవీతో అతనికి పెరిగిన క్రేజ్ అంతాఇంతా కాదు.. ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Advertisement

పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత గీత గోవిందం మూవీ సైతం హిట్ కావడంతో అతనికి ఫ్యాన్స్, ఫాలోవర్స్ మరింత పెరిగారు. ప్రస్తుతం ఆయనకు 13.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాలో నంబర్ వన్ సెలబ్రిటీ గా విజయ్ రికార్డు సృష్టించాడు. గీత గోవిందం తర్వాత వచ్చిన పలు చిత్రాలు ఫెయిల్ అయినా.. దాని ప్రభావం ఆయన ఫాలోవర్స్ పై ఏమాత్రం పడలేదు.

Advertisement

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే ఆయన 13.4 మిలియన్ల ఫాలోవర్స్‌తో విజయ్ దేవరకొండ తర్వాతి స్థానంలో ఉన్నారు. మంచి ఫ్యామిలీ బ్యాగ్‌రౌండ్ ఉన్న బన్నీ.. నెక్ట్ పుష్ప మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్‌లోకి వస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే ఆయన ఫ్యాన్స్, ఫాలోవర్స్ మరింత పెరగడం ఖాయం. చూడాలి మరి పుష్ప ఏ రేంజ్ హిట్ అవుతుందో.. దీంతో రౌడీ హీరో ఫాలోవర్స్ పై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే.. చెప్పలేం..
Read Also : Aryan Khan‌కు బెయిల్.. RGV వాయింపుడు మొదలు

Advertisement
Advertisement