...

Alia Bhatt : గుడ్ న్యూస్ చెప్పిన అలియా… త్వరలోనే బేబీ కాబోతున్నారంటూ పోస్ట్… శుభాకాంక్షలు తెలుపుతున్న నెటిజన్లు!

Alia Bhat : బాలీవుడ్ స్వీట్ కపుల్స్ ఆలియా భట్ రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇద్దరు స్టార్ కిడ్స్ గా ఎంట్రీ ఇచ్చి తమ కంటూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతున్న వీరిద్దరూ ప్రేమలో పడి ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతో ఘనంగా వీరి వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లయిన రెండు నెలలకి శుభవార్తను తెలిపారు.ఈరోజు అలియాభట్ సోషల్ మీడియా వేదికగా తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని వెల్లడించారు.

Advertisement
alia-says-good-news-post-that-baby-was-cooming-soon-netizens-wishing-her
alia-says-good-news-post-that-baby-was-cooming-soon-netizens-wishing-her

అలియా భట్ సోషల్ మీడియా వేదికగా హాస్పిటల్లో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ అవర్ బేబీ కమింగ్ సూన్ అంటూ అసలు విషయం చెప్పారు. ఇక ఈ ఫోటోలలో రణబీర్ కపూర్ ఉండడం గమనార్హం.ఇక ఈ ఫోటోతో పాటు లయన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోని కూడా ఈమె షేర్ చేస్తూ తను తల్లి కాబోతున్నాననే విషయాన్ని వెల్లడించారు.

Advertisement

ఈ విధంగా అలియా భట్ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకోవడంతో ఈ పోస్టు క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతోమంది నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే వీరిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్రం సినిమా సెప్టెంబర్ 9వ తేదీ విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్న ఈ జంట ఇలాంటి శుభవార్తను చెప్పడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Read Also : Alia bhatt pregnnt: గుడ్ న్యూస చెప్పిన ఆలియా భట్.. తల్లికాబోతున్నానంటూ పోస్ట్!

Advertisement
Advertisement