Naga Chaitanya : నాగచైతన్య కొత్త మూవీ థాంక్యూ (thank you) త్వరలో రిలీజ్ కానుంది. ఈ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అతి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతూ తన థాంక్యూ మూవీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తన పర్సనల్ లైఫ్ విషయంలో బాగా ఎమోషనల్ అయ్యాడు. అది చైతూ తన పేరంట్స్, ఫ్రెండ్స్ గురించి రివీల్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తనకు చాలా ఇష్టమైన వ్యక్తులతో కలిసి దిగిన కొన్ని ఫొటోలను నాగ చైతన్య షేర్ చేశాడు. థాంక్యూ అనే పదాన్నే ఎక్కువగా వాడుతుంటాను. అలాగే తనకు జీవితంలో ఎలా ఉండాలో ఎంత ప్రేమగా ఉండాలో తనకు చెప్పిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Actor Naga chaitanya Emotional Post Goes Viral In Social Media
నాగార్జునతో కలిసి దిగిన ఫొటోతో పాటు తన తల్లి లక్ష్మితో దిగిన చిన్నప్పటి ఫొటోలను చైతూ షేర్ చేశాడు. ఆ రెండు ఫొటోలతో పాటు తనకెంతో ఇష్టమైన పెట్ హాష్ కుక్క పిల్ల ఫోటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు చైతూ.. చైతూ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘థాంక్యూ.. ఎక్కువగా నేను వాడే పదం.. ఎన్నిసార్లు చెప్పిన సరిపోదు.
Naga Chaitanya : నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్.. పాత జ్ఞాపకాల గురించేనా?
నా నెక్ట్స్ మూవీ థాంక్యూ ఇదే విషయాన్ని గుర్తు చేస్తుంది. మూవీ జర్నీలో నన్ను కదిలించిన విషయం కూడా ఇదే.. అందుకే ఈ పోస్ట్ నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులకు నేను అంకితం చేస్తున్నాను. కృతజ్ఞతలు చెప్పడానికి సరిపోదు. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తుల ఫొటోలను షేర్ చేయడం అందరికీ ఇష్టం ఉంటుంది. #themagicwordisthankyou ట్యాగ్ చేయండి.
అమ్మ.. నా కోరిక ఎప్పుడు నాతోనే ఉంటుంది. నన్ను అదే ఎక్కువగా ప్రేమిస్తుంది. నాన్న.. నాకు దిశానిర్దేశం చేస్తాడు. నాతోనే ఉండిపోతాడు. నా స్నేహితుడు హాష్.. ఎలా ప్రేమించాలో.. ఎలా ఉండాలో అనుభూతులను కలిగించావు.. నన్ను ఒక మనిషిగా ఉండేలా చేశావు.. సో థాంక్యూ అంటూ భావోద్వేగ పోస్ట్ చేశాడు. థాంక్యూ మూవీ జూలై 22న రిలీజ్ కానుంది. రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు.
View this post on Instagram
Advertisement
Read Also : Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీని చూశారా?.. క్యూట్ ఫ్యామిలీ పిక్ వైరల్..!