Devotional Tips: హిందు సంప్రదాయం ప్రకారం ఉప్పుని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. అందుకే ఉప్పును పొరపాటున కూడా ఇతరులకు దానం ఇవ్వము. ఇక సంధ్యా సమయంలో ఉప్పును కొనుగోలు చేయడం కానీ చేయరు. అయితే ఉప్పుకు లక్ష్మీదేవికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఎందుకు ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారనే విషయానికి వస్తే….
పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం ఎన్నో రకాల వస్తువులు బయటకి వచ్చాయి. వాటిలో లక్ష్మీదేవి కూడా ఒకటి. లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి ఉద్భవించినది కనుక లక్ష్మీదేవిని సముద్రుని కూతురుగా భావిస్తారు.ఇక సముద్ర గర్భంలోనే మనకు ఉప్పు లభ్యమవుతుంది. కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తూ ఉప్పును తొక్కకుండా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక మన ఇంట్లో నుంచి ఉప్పు దానం చేయటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవినీ దానం చేసినట్లే అందుకే ఉప్పును దానం చేయకూడదని భావిస్తాము.
ఉప్పుతో ఎన్నో పరిహారాలను పాటిస్తుంటారు. మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తినప్పుడు ఉప్పుతో పలు రకాల పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడి ఉన్న సమస్యలు తొలగిపోతాయని భావిస్తారు. అందుకే ప్రతి శుక్రవారం ఒక గ్లాసు నిండా నీటిని తీసుకొని అందులో ఉప్పు వేసి ఇంట్లో ఒక మూలన పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల తొలగిపోతాయి. అదేవిధంగా ఎర్రని వస్త్రంలో పిడికెడు ఉప్పురాళ్లు వేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద కట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును తొలగించి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేయటం వలన మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World