Devotional Tips: ఇలాంటి దానాలు కనుక చేస్తే లక్ష్మీదేవిని ఇంటినుంచి పంపినట్లే…?

Devotional Tips: సాధారణంగా దానధర్మాలు మనకు మంచి ఫలితాలను అందిస్తాయని భావిస్తాము. అందుకే మనకు ఉన్నంతలో ఇతరులకు దానధర్మాలు చేయడం వల్ల ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి.అయితే కొన్ని సార్లు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సాక్షాత్తు మన ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీదేవి బయటకు పంపినట్లని పండితులు చెబుతున్నారు. మరి ఏ వస్తువులను దానం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయానికి వస్తే….

ఉచితంగా ఇతరులకు సూది, కత్తెర, కత్తులు వంటి వస్తువులను దానం చేయడం వల్ల ఏరికోరి మన జీవితంలో కష్టాలను తెచ్చుకున్నట్లే. ఈ విధమైనటువంటి వస్తువులను దానం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు తలెత్తుతాయి. అలాగే చాలామంది పాడైన ఆహారాన్ని ఇతరులకు దానం చేస్తుంటారు. ఇలా పాడైన ఆహారం దానం చేయటం వల్ల ఎన్నో వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మన ఇంట్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురయి దీన పరిస్థితికి వెళ్ళిపోతారు.

ఇక మన ఇంట్లో ఏదైనా విరిగిపోయిన లేదా చినిగిపోయిన వస్తువులను కూడా ఇతరులకు దానం చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అలాంటి వస్తువులను ఇంటిలో కూడా పెట్టుకోకుండా ఎక్కడైనా బయట పడేయాలి. ఇలాంటి వస్తువులు ఇంటిలో ఉండటంవల్ల నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెంది ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం చీపురును లక్ష్మీ దేవిగా భావిస్తాము అలాంటి చీపురు ఉచితంగా దానం చేయడం వల్ల సాక్షాత్తు మన ఇంటి నుంచి మనమే లక్ష్మీదేవిని బయటికి పంపినట్లు అవుతుంది. అందుకే ఉచితంగా అయినా కూడా ఇలాంటి వస్తువులను దానం చేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel