September 21, 2024

Beauty Tips: ఒక్కసారి ఈ ఫేసియల్ ట్రై చేయండి.. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం..

1 min read
pjimage 3

Beauty Tips: తేనెలో ఆరోగ్యానికి మేలు కలిగించే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. తేనె తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని ఎన్నో రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తేనెను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఎన్నో సంవత్సరాల నుండి తేనెను చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కూడా వినియోగిస్తున్నారు. ఎండ వల్ల ముఖం నల్లబడటం నుంచి డల్ స్కిన్ ని కాంతివంతం గా మార్చగలిగే అన్ని శక్తి తేనె లో ఉంది.

pjimage 3చర్మ సౌందర్యం కోసం వేలకు వేలు బ్యూటీ పార్లర్ లకు పోసి, కెమికల్ కాంపోజిషన్ ఎక్కువ ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం కంటే, నేచురల్ గా దొరికే తేనే మీకు ఎంతో సహాయపడుతుంది. మీరు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మీ చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవాలి అనిపిస్తే వెంటనే తేనే తో పాటుగా కొన్ని రకాల పదార్థాలు ఇంట్లో ఉండటం వల్ల మీరు బ్యూటీపార్లర్లో వినియోగించే ఫేస్ ప్యాక్ ల లాగా తేనెను వినియోగించవచ్చు. ఇది మీ చర్మాన్ని కాపాడడమే కాకుండా డబ్బును ఆదా చేస్తుంది. తేనెతో ఫేస్ ప్యాక్ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తేనెతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి: ఫేషియల్ కు ముందు తేనెతో ముఖాన్ని కడగండి. ముందుగా ముఖాన్ని నీటితో కడగండి, తేనెను పలుచగా ముఖం మరియు గొంతు మీద రాయండి. దానిని 20 నిముషాలు అలాగే వదిలేసి తర్వాత వేడి నీటితో ముఖాన్ని కడుక్కోండి. దీనివలన చర్మం పై ఉన్న జిడ్డు, మురికి తొలగిపోతుంది.

తేనెతో ఫేస్ స్క్రబ్: ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత తేనె పంచదార పొడి వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తడి గా ఉన్న ముఖం మీద అప్లై చేసి మెల్లగా మసాజ్ చేయండి. ఇలా అయిదు నుండి పది నిముషాలు అలాగే వదిలేసి తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

హనీ ఫేషియల్ టోనర్: కీరా దోసకాయ రసాన్ని తేనె తో కలిపి ఒక బాటిల్ లోకి తీసుకోండి. దీనిని ముఖం, మెడ భాగాల మీద స్ప్రే చేసుకుని దూదితో మెల్లగా రుద్దండి.

తేనె ఫేస్ ప్యాక్: సగం అరటి పండు తీసుకొని దానిని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ అరటి పండు మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో పైన అప్లై చేసి పది నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివలన ముఖం కాంతివంతం అవుతుంది.