Radhe Shyam First Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రపంచమంతా ప్రభాస్ కొత్త మూవీ రాధేశ్యామ్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 11న (శుక్రవారం) రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి సినీ క్రిటిక్స్ సినిమా రిలీజ్‌కు ముందే తమ రివ్యూలను ఇచ్చేస్తుంటారు. ట్విట్టర్ వేదికగా ముందుగానే సినిమా ఎలా ఉండబోతుంది? అనేది అంచనా వేస్తుంటారు.
ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలా ఉండబోతుందో ముందుగానే చెప్పేశారు ప్రముఖ సినీ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు.. రాధేశ్యామ్ మూవీని తాను చూశానని రివీల్ చేశారు. ఈ మూవీలో అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అన్నారు.

ప్రభాస్ సరసన నటించిన హీరోయిన్ పూజా హెగ్డే మధ్య లవ్ సీన్స్ అద్భుతుంగా ఉన్నాయని, ఉమైర్ సంధు కామెంట్ చేశారు. రాధేశ్యామ్‌లో క్లైమాక్స్ ప్లస్ పాయింట్ అని, అసలు ఎవరూ ఊహించినట్టుగా ఉంటుందని చెప్పారు.
Radhe Shyam First Review : ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే.. సినిమాకు హైలట్ అదేనట..!

ప్రభాస్ తన నటనతో అద్భుతంగా నటించాడని చెప్పారు. అలాగే రాధేశ్యామ్ ఒక ఎపిక్ (Epic) అంటున్నారు. ప్రభాస్ స్టయిల్, ఆయన క్లాస్ సినిమాకే పెద్ద హైలట్ అని, ఆయనకు ఆయనే సాటి అంటూ ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశారు. దాంతో రాధేశ్యామ్ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. సాధారణంగా ప్రతి సినిమాకు ఉమైర్ సంధు సోషల్ మీడియా వేదికగా రివ్యూలను ఇస్తుంటారు.
అన్నిసార్లు ఉమైర్ ఇచ్చిన సినిమా రివ్యూల అంచనాలు ఊహించినట్టుగా జరగలేదు. కొన్ని సినిమాలకు ఉమైర్ రివ్యూకు పాజిటివ్ ఇచ్చినప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద నెగటివ్ టాక్ అందుకున్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన రాధేశ్యామ్ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. సినిమాపై భారీ బడ్జెట్ తో నిర్మించారు. మరో ఐదు రోజుల్లో రాధేశ్యామ్ రిలీజ్ కానుండగా.. అందరి అంచనాలకు తగినట్టుగా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు రికార్డుల కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.
Read Also : Radhe Shyam Making Video : రాధేశ్యామ్ మేకింగ్ వీడియో చూశారా? అద్భుత సృష్టికి సలాం కొట్టాల్సిందే..!