Kacha Badam Telugu Version : కచ్చా బాదం సాంగ్ ప్రపంచమంతా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడా ఆ బెంగాలీ పాటకు పోటీగా మన తెలుగు వెర్షన్‌లో కచ్చా బాదమ్ సాంగ్ వచ్చేసింది. అచ్చ తెలుగులో యూట్యూబ్‌లో ‘పల్లీ పల్లీ.. ఇది పచ్చీ పల్లి’.. అంటూ పాట దుమ్ములేపుతోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్ బద్యాకర్ అనే పల్లీల వ్యాపారి కంపోజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఇప్పుడీ పాటకు పోటీగా తెలుగులోనూ పల్లీ పల్లీ ఇది పచ్చీ పల్లి అంటూ సాగే ఈ పాట కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. పచ్చీ పల్లీ అనే పాటతో రిలీజ్ అయిన ఈ పాట యూట్యూబ్ యూజర్లను ఎంతో ఆకట్టుకుంటోంది.
‘నా పేరు మట్టయ్య. ప్రతిరోజు బీచ్‌లో పల్లీలు అమ్ముతుంటాను. పిజ్జాలు, బర్గర్లకు అలవాటు పడిన జనం.. నా పల్లీలు కొనడం మానేశారంటూ వీడియోలో ముందుగా వాయిస్ వినిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడూ నేను హాయిగా పల్లీలు అమ్మకపోవచ్చు అని వినిపిస్తుంది. అప్పుడు నాకో ఆలోచన తట్టింది. పచ్చీ పల్లీల షోరూమ్.. కనిపిస్తుంది. కట్ చేస్తే.. థియేటర్లలో సినిమాకు ముందు ముకేశ్ యాడ్ రీక్రియేట్ చేశారు. ఇక్కడి నుంచే పాట మొదలవుతుంది.
‘పల్లీ పల్లీ.. ఇది పచ్చీ పల్లి’ అంటూ లిరిక్స్‌తో స్టార్ట్ అవుతుంది. ఈ పాటను స్వయంగా తానే కంపోజ్ చేసుకున్నాడట.. అంతేకాదు.. పాట కూడా ఇతడే పాడాడు.. సూర్య అకొండి అనే యూట్యూబర్ అన్నీ తానై పాటకు ప్రాణం పోశాడు. సిల్కీ మాంక్స్ నిర్మాణంలో ఈ పాటను క్రియేట్ చేశారు. లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇక విద్యాసాగర్ కెమెరామెన్‌గా వ్యవహరించాడు.
బెంగాలీ కచ్చా బాదామ్ మాదిరిగానే ఈ పల్లీ పల్లీ.. ఇది పచ్చీ పల్లి అనే పాట తెలుగు వెర్షన్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అచ్చ తెలుగులో సాగే ఈ పాట నెట్టింట్లో దుమ్ములేపుతోంది.. కచ్చా బాదమ్ పల్లీ పల్లీ ఇది పచ్చీ పల్లి కథ ఏంటో మీరు కూడా చూసేయండి.. వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Read Also : Two Naughty Guys : వీళ్లు మగాళ్లు రా బుజ్జి.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. చివర్లో ఏమైందంటే?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world