Jabardasth Jodi Love : ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో పలువురు ప్రేమ పేరు తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సుడిగాలి సుదీర్ మరియు యాంకర్ రష్మి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అంటూ కార్యక్రమ నిర్వాహకులు కలరింగ్ ఇస్తూ వస్తున్నారు. అలాగే చాలా మంది జంటల మధ్య కూడా ప్రేమ వ్యవహారం జరుగుతుంది అని చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేమ జంటలను చూపించడం వల్ల ఆ షో లకు మంచి ఆదరణ లభిస్తోంది.
వారి కోసం అయినా వాటిని చూసేందుకు జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఫేక్ లవ్ స్టోరీలను ఇప్పుడు మొదలు పెడుతున్నారు. చాలా మంది ఫేక్ లవ్ స్టోరీలను ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మరియు టీవీ షో ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో కొన్ని రియల్ ప్రేమ జంటలు కూడా ఉన్నాయి. ఈ ఫేక్ జంటల మధ్య రియల్ జంటలు ఎవరు అనేది జనాలు తేల్చుకోలేక పోతున్నారు.

జబర్దస్త్ జోడిల్లో అసలు ప్రేమ జంట ఎవరు అంటే రాకింగ్ రాకేష్ మరియు సుజాత. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు. ఒకరినొకరు ఇష్టపడుతున్న వీరిద్దరూ అతి త్వరలోనే పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇదే ఏడాది చివర్లో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక జబర్దస్త్ ప్రవీణ్ మరియు ఫైమా కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లు గా చెప్పకనే చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఫైమా అతడి ప్రేమను ఒప్పుకోలేదు. అతడు ప్రేమిస్తున్నాను అని చెప్పిన ప్రతి సారి కూడా నవ్వు నవ్వేసి ఊరుకుంది. దాంతో అసలు వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా అంటూ చర్చ మొదలైంది. ఇంకా చాలా మంది తాము ప్రేమలో ఉన్నట్లుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందులో ఎవరిది నిజమైన ప్రేమ అనేది మాత్రం క్లారిటీ లేదు.
Read Also : MLA Roja Nagababu : నాగబాబుకు ఎమ్మెల్యే రోజా కౌంటర్.. పవన్‌పై సంచలన కామెంట్స్..!
- Extra Jabardasth : ఆ రోజు 13 లాఠీలతో బట్టలూడదీసి కుళ్లబొడిచారు.. అప్పటి వ్యభిచారంపై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ..!
- Extra Jabardasth : జబర్దస్త్ గెస్ట్ జడ్జ్‌గా వచ్చే ఆమనికి ఎంత పారితోషికం ఇస్తారో తెలుసా?
- Jabardasth New Anchor : జబర్దస్త్‌లోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. పల్లకిలో వచ్చిన ఆ గ్లామర్ బ్యూటీ ఎవరో తెలిసిందోచ్..!














