Jabardasth New Anchor : జబర్దస్త్‌లోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. పల్లకిలో వచ్చిన ఆ గ్లామర్ బ్యూటీ ఎవరో తెలిసిందోచ్..!

Jabardasth New Anchor : జబర్దస్త్ కామెడీ షోలోకి కొత్త యాంకర్ వచ్చేసింది. ఇప్పటివరకూ జబర్దస్త్ యాంకర్‌గా కొనసాగిన అనసూయ కామెడీ షో నుంచి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రత్తమ్మ ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది కూడా. అయితే అనసూయ తర్వాత అదే రేంజ్‌లో ఆకట్టుకునే యాంకర్ ఎవరు వస్తారా? అనే సస్పెన్స్‌కు తెరపడింది. జబర్దస్త్ కొత్త యాంకర్ ఎంట్రీ ఖరారు అయింది. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా చేస్తున్న రష్మీ గౌతమ్‌ను తీసుకొస్తారని భావించారంతా.. కానీ, ఈ విషయంలో కామెడీ షో నిర్వాహాకులు మాత్రం రష్మీకి బదులుగా మరో కొత్త యాంకర్‌ను తీసుకురావాలని నిర్ణయించారు.

Jabardasth New Anchor _ New Anchor Entry Into Jabardasth Comedy Show After Anasuya Exit
Jabardasth New Anchor _ New Anchor Entry Into Jabardasth Comedy Show After Anasuya Exit

అందులో భాగంగానే జబర్దస్త్ కొత్త యాంకర్‌ను తీసుకొచ్చారు. లేటెస్టు జబర్దస్త్ ప్రోమో చూస్తుంటే.. అది నిజమేనని అనిపిస్తోంది. జబర్దస్త్ మేకర్స్ ఆగస్టు 4వ తేదీన టెలిక్యాస్ట్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో కూడా వదిలారు. అందులో కొత్త యాంకర్ ఎంట్రీని సస్పెన్స్‌గా ఉంచారు. నిఖిల్ హీరోగా కార్తికేయ 2 మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిఖిల్, శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు చందు మొండేటి జబర్దస్త్ కామెడీ షోకి వచ్చారు. ఈ మూవీ టీమ్ తమదైన శైలిలో కామెడీ టైమింగ్‌తో సందడి చేశారు. జబర్దస్త్ కామెడీ షోలో మనోకు బదులుగా నటి సంగీతను తీసుకొచ్చారు. ఇంద్రజ జడ్జిగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ వారం షోలో కమెడియన్ల స్కిట్లను మరింత ఆసక్తిని కలిగించేలా ఎడిట్ చేశారు.

Jabardasth New Anchor : జబర్దస్త్‌ కొత్త యాంకర్.. పల్లకిలో తీసుకొచ్చి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన కమెడియన్లు..

Jabardasth New Anchor _ New Anchor Entry Into Jabardasth Comedy Show After Anasuya Exit
Jabardasth New Anchor _ New Anchor Entry Into Jabardasth Comedy Show After Anasuya Exit

ఈ కామెడీ షోలో కొత్త యాంకర్ ఎంట్రీని చూపించారు. అందులో కొత్త యాంకర్ ఎవరూ అనే విషయాన్ని రివీల్ చేయకుండా ప్రోమోలో జాగ్రత్త పడ్డారు. ఆ కొత్త యాంకర్‌ను పల్లకిలో తీసుకొచ్చారు. కమెడియన్లంతా ఆ కొత్త యాంకర్‌కు వెల్ కమ్ చెప్పినట్టుగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ కొత్త యాంకర్ ఎవరు అనేది రివీల్ చేయలేదు. జబర్దస్త్ కమెడియన్లు అందరూ కలిసి ఆమెను పల్లకిలో మోసుకొచ్చి లోపలి కూర్చోబెట్టారు. కానీ ఆమె ఫేస్ ఎలా ఉంటుంది? ఆమె ఎవరు అనే విషయం మీద ఆసక్తి పెంచేశారు? బహుశా షో ప్రసారం కావడానికి ఒకటి రెండు రోజులు ముందు ఈ విషయాన్ని రివీల్ చేసే అవకాశం ఉంది. లేదా డైరెక్ట్ గా నాలుగో తేదీన ప్రసారమయ్యే జబర్దస్త్ ఎపిసోడ్ లోనే దాన్ని రివీల్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే వాళ్లు రివిల్ చేయలేదు.

Advertisement

పల్లకిలో వచ్చిన ఆ కొత్త యాంకర్ ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు.. ఆ గ్లామరస్ బ్యూటీ యాంకర్ మంజూష.. ఇకపై జబర్దస్త్ కొత్త యాంకర్‌గా మంజుష కొనసాగనున్నట్టు ప్రచారం సాగుతోంది. యాంకర్ మంజుష గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో రాఖీ మూవీలో ఎన్టీఆర్ చెల్లెలి పాత్రలో నటించించింది ఈ అమ్మడు. ప్రస్తుతం సినీ ఈవెంట్లకు యాంకర్‌గా చేస్తోంది. గ్లామర్ డోసు పెంచడంలో తగ్గేదేలే అన్నట్టుగా ఉండే మంజుషనే జబర్దస్త్ కొత్త యాంకర్ అనేది తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read Also : Jabardasth Nokaraju : చేతిలో కర్పూరం వెలిగించుకున్న నూకరాజు.. నిజంగానే ఆసియాకు తాళి కట్టేశాడు.. వీడియో!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel