Health Tips : సపోట పండుతో ఇన్ని బెనెఫిట్స్ ఉన్నాయి అని తెలుసా..!

Health Tips : ఆరోగ్యానికి మేలు చేసే ఆరోగ్యకరమైన పండ్లలో సపోట ఒకటి. అధిక పోషకాలు కలిగి ఉండటం వల్ల పోషకాహార నిపుణులు సైతం ఈ పండ్లు తినమని సూచిస్తుంటారు. ఈ సపోట పండులోని గుజ్జు చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే దీన్ని జ్యూస్ గా చేసుకుని తీసుకుంటారు. మన శరీరంలో శక్తిని అందించడంలో సపోటాను మించింది లేదని చెప్పాలి.

విటమిన్- A కంటికి సంబంధించిన సమస్యలను వెంటనే నివారిస్తుంది. సపోటాలో పోషకాల్లో నియాసిన్, కాపర్, ఐరన్ లాంటి మూలకాలు ఎన్నో ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారంతా ఈ సపోటాను తింటే మరింత బలంగా అవుతారు. ఈ సపోట పండ్లలోని ఫైబర్లు మలబద్దకాన్ని వెంటనే దూరం చేస్తాయి. ఒత్తిడి సమస్యతో బాధపడేవారికి మంచి ఆహారంగా చెప్పవచ్చు. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగించడంలోనూ సపోటా సాయపడుతుంది. సపోటా ఆకులతో పాటు చెట్టుకు సంబంధించిన బెరడు అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఔషదంగా వినియోగిస్తుంటారు.
Health Benefits Of Sapota Chikoo Benefits 0

సపోటాలో లభించే విటమిన్ బి, సి, ఇ, పొటాషియం, మాంగనీస్, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికమొత్తంలో లభిస్తాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్‌ పుష్కలంగా లభిస్తాయి. దాంతో ఎముకల కూడా గట్టిగా తయారవుతాయి. గర్భిణీల్లో అలాగే చంటిపిల్లలకు పాలు పట్టే తల్లులకు సపోటా చాలా మంచిది. బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారికి ఆహారంగా సూచించవచ్చు.

క్యాన్సర్ నిరోధక లక్షణాలు సపోటాలో పుష్కలంగా ఉంటాయి. రోమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. సపోటాలో మిథనాలిక్ క్యాన్సర్ కణితులను అడ్డుకుంటుంది. కడుపులో ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి జీర్ణసంబంధిత సమస్యలను నివారిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అలాగే ప్రకాశవంతంగా ఉంచుతుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందించటం ద్వారా డిప్రెషన్, టెన్షన్ సమస్యలను నివారించుకోవచ్చు.