Astrology News : ఈ శుక్ర‌వారం రోజు ఇలా చెస్తే… ఇక డబ్బుకు కొదువుండదు !

Astrology News : ప్రతి ఇంట్లో అంద‌రికీ ఆర్థిక స‌మ‌స్య‌లు తలెత్తడం సహజమే. అయితే అవి లేకుండా చేయాలన్న, ఇంట్లో డబ్బు నిల‌వాల‌న్నా… సంప‌ద చేకూరాల‌న్నా అందుకు ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ఉండాల‌న్న విష‌యం విదిత‌మే. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హిస్తేనే మ‌న‌కు సంప‌ద‌లు ల‌భిస్తాయి. అందువ‌ల్ల ప్ర‌తి శుక్ర‌వారం త‌ప్ప‌నిస‌రిగా ఆమెను పూజించాల్సి ఉంటుంది. శుక్ర‌వారం రోజు తలస్నానం చేసి, తెల్లని వస్త్రాల‌ను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి.

astrology-tips-to-avoid-financial-crisis
astrology-tips-to-avoid-financial-crisis

అనంత‌రం తామరపూలతో అలంకరించబడిన లక్ష్మీదేవిని వివిధ రూపాల‌లో దర్శించి శ్రీ సూక్తం పఠించాలి. ప్రతి శుక్రవారం ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయి. సంపదలు పెరుగుతాయి. ఎవరి జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారాల్లో ఆవు నెయ్యిని ఆలయానికి దానం చేయాలి. దీంతో శుక్రుడు బలవంతుడ‌వుతాడు. సంపదల‌ను ఇస్తాడు. శుక్ర‌వారం న‌ల్ల‌చీమ‌ల‌కు చ‌క్కెర పెట్ట‌డం వ‌ల్ల క‌ష్టాలు తొల‌గిపోతాయి. బాధ‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

 

Advertisement

అలానే ఇంట్లో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఎక్కువ‌గా ఉంటే శుక్ర‌వారం పూట ల‌వ్ బ‌ర్డ్స్ పెయింటింగ్స్ లేదా పోస్ట‌ర్స్‌ను ఇంట్లో పెట్టుకోవాలి. దీంతో వారి మ‌ధ్య క‌ల‌హాలు త‌గ్గుతాయి. దాంప‌త్యం అన్యోన్యంగా ఉంటుంది. అలాగే శుక్ర‌వారం రోజు ల‌క్ష్మీ దేవికి ఉప‌వాసం ఉండ‌డం, పింక్ రంగు దుస్తుల‌ను ధ‌రించ‌డం లేదా ఆ రంగులో ఉండే చేతి రుమాలును ద‌గ్గ‌ర ఉంచుకోవ‌డం, ల‌క్ష్మీదేవికి ఇష్ట‌మైన తామ‌ర‌పువ్వులు, శంకువు, దండ‌ల‌ను అలంక‌రించ‌డం.. వంటి ప‌నుల‌ను చేయాలి. దీంతో ల‌క్ష్మీ దేవి సంతోషించి అనుగ్ర‌హిస్తుంది. ఆర్థిక స‌మ‌స్య‌లు పోయి ధ‌నం ల‌భిస్తుంది. డ‌బ్బు చేతిలో నిల‌క‌డ‌గా ఉంటుంది.

Read Also : Vastu Tips : లక్ష్మీదేవి కటాక్షం పొంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ నాలుగు పనులు చేస్తే సరి..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel