Health Tips : ఆడవారిలో ఇమ్యునిటీ పవర్ ఎక్కువ ఉండడానికి కారణం అదేనా ?

Updated on: February 16, 2022

Health Tips : స్త్రీ, పురుషుల శరీర నిర్మాణ వ్యవస్థ లోనూ, మానసిక స్థితిలో, హార్మోన్ల స్థాయిలు వంటి ఎన్నో అంశాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందులోనూ పురుషుల కంటే మహిళలకే క్యాన్సర్, హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా తక్కువ. ముఖ్యంగా అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడంలో ఆడవారే ముందుంటారని తాజా అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. ప్రమాదకరమైన రోగాలు, రకరకాల అంటు వ్యాధులను దూరం చేసే రోగ నిరోధక శక్తి మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువ ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనికి కారణం జన్యు నిర్మాణంలో వచ్చిన మార్పేనని శాస్త్రవేత్తలే తేల్చి చెప్పారు.

కాగా ఈ జెనిటిక్ స్ట్రక్చర్ నే మైక్రో ఆర్ఎన్ఏలు అని కూడా అంటారని శాస్త్రవేత్తలు వెళ్లడిస్తున్నారు. ఈ మైక్రో ఆర్ఎన్ఏలు ఆడ క్రోమోజోమ్ పై ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మైక్రోఆర్‌ఎన్‌ఏలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని తేల్చి చెప్పారు. కాగా ఇవి ఆడవారిలోనే ఇమ్యూనిటీని పవర్ ను మరింత పెంచుతాయి. అలానే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎల్లో ఫీవర్, ఫ్లూ, డెంగ్యూ వంటి అనేక రోగాలతో పోరాడేందుకు టీకాలు వేసుకున్న మహిళల్లో యాంటీ బాడీస్ ను అధికంగా రిలీజ్ చేయడంలో మైక్రో ఆర్‌ఎన్‌ఏలు లు ప్రధాన పాత్ర పోషిస్తాయని తేలింది.

Advertisement

అనేక వ్యాధుల నుంచి మనల్ని కాపాడే రక్షణ ప్రతిరోధకాలను మెరుగుపరిచే రోగ నిరోధక శక్తి మగవారిలో కంటే ఆడవారిలోనే అధికంగా ఉంటుంది. అయితే ఆడవారిలో టి -సెల్ యాక్టివేషన్ ప్రొడక్షన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే ఇంటర్ ఫెరాన్ ఉన్నప్పటికీ కూడా బాగానే జరుతుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel