Shanmukh Jaswanth : దీప్తి సున‌య‌న‌తో బ్రేకప్‌పై షణ్ముఖ్ షాకింగ్ కామెంట్స్.. అదే మా మధ్య చిచ్చు పెట్టింది.. అందుకే నన్ను వదిలేసింది..!

Updated on: August 4, 2025

Shanmukh Jaswanth Break Up : పాపులర్ యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్మంత్ దీప్తి సునయనతో బ్రేకప్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీప్తితో తన లవ్ బ్రేకప్‌కు సిరి హన్మంతు అసలే కాదన్నాడు. తనకు సిరితో చాలా ఏళ్లుగా మంచి స్నేహం ఉందన్నాడు. లవర్స్ డే సందర్భంగా షణ్ముక్ దీప్తితో బ్రేకప్ గురించి అసలు విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతానికి షన్నూ తన కెరీర్‌పైనే దృష్టి పెట్టిన‌ట్లు తెలిపాడు. లవర్స్ డే సందర్భంగా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో షన్నూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

అందుకే.. దీప్తి నన్ను వదులుకుంది..
దీప్తి సునాయన నాతో విడిపోవ‌డానికి అనేక కార‌ణాలున్నాయని చెప్పాడు. నా కారణంగానే దీప్తి నెగిటివిటీని ఫేస్ చేసింది. నెటిజన్లు ట్రోల్స్ చేసినా నాకు ఎంతో స‌పోర్ట్ చేసింది. సిరితో బిగ్ బాస్ షోలో చ‌నువుగా ఉండ‌టం బయట నుంచి చూసేవాళ్లకు ఎలా నచ్చలేదో.. అలానే దీప్తి ఫ్యామిలీకి న‌చ్చ‌లేదు. ఈ విషయంలోనే తన ఫ్యామిలీ నుంచి దీప్తిపై ఒత్తిడి పెరిగింది. కుటుంబ సభ్యుల నుంచి పెరిగిన ఒత్తిడే.. మా మధ్య చిచ్చు పెట్టిందని షన్నూ చెప్పుకొచ్చాడు. ఆ ఒత్తిడి వల్లే దీప్తి తనను వదులుకునేందుకు సిద్ధమైందని తెలిపాడు.

Shanmukh Jaswanth Break Up : Shanmukh Jaswanth Shocking Comments with Deepthi Sunaina Breakup Reveals on Siri Hanmanth
Shanmukh Jaswanth Break Up : Shanmukh Jaswanth Shocking Comments 

తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండాల‌నే బ్రేక‌ప్ చెప్పాల్సి వచ్చిందన్నాడు. దీప్తి, నేనూ కెరీర్‌ల‌పైనే దృష్టి పెట్టాం.. మళ్లీ దీప్తితో కలుస్తానా లేదా అనేది ఆ దేవుడే చెప్పాలి.. బ్రేకప్ జరగాలని ఉంది.. అదే జరిగింది.. తిరిగి కలుస్తామా లేదా అనేది విధి నిర్ణయిస్తుందని భావిస్తున్నా.. అంతేకానీ… మా బ్రేక‌ప్‌కు సిరి కారణమని నిందించ‌డం సరికాదని ష‌ణ్ముఖ్ క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

Shanmukh Jaswanth Break Up : సిరిని ఏమనొద్దు.. దేవుడే మమ్మల్ని కలపాలి.. 

దయచేసి సిరిని నిందించొద్దు.. సిరి నేను మంచి స్నేహితులమని షన్నూ క్లారిటీ ఇచ్చాడు.. బిగ్ బాస్ హౌస్‌లో సిరికి అండగా ఉన్నాను అంతే.. సిరితో చనువుగా ఉండటం చూసేవారికి నచ్చలేదు.. నెటిజన్లలో నెగటివిటీకి కారణం కూడా ఇదేనని అర్థమైంది. హౌస్‌లోకి రావడానికి ముందే శ్రీహాన్ తో సిరి, నేను దీప్తితో రిలేషన్ షిప్ లో ఉన్నామని అందరికి తెలుసు.. బిగ్ బాస్ ఇంట్లో పరిస్థితుల కారణంగా మా ఇద్దరి మధ్య చనువు పెరిగింది.. అది చూసేవారిలో నెగటివిటికీ దారితీసింది. అదే దీప్తితో బ్రేకప్ వరకు తీసుకొచ్చింది. అంతే..

నేను ఇత‌రుల‌తో త‌క్కువ‌గా మాట్లాడుతాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్‌బాస్ రియాల్టీ షోకి నేను సెట్ కాను. ప్రేక్ష‌కుల్లో గుర్తింపు కోస‌మే రియాల్టీ షోలో పాల్గొన్నాను. ఆ షోలో నాపై ప్రేక్ష‌కులు పాజిటివ్‌గానే ఉన్నారని అనుకునేవాడిని. బ‌య‌ట‌కు వ‌చ్చాక‌నే అస‌లు విషయం తెలిసింది.. నాపై ఎంతగా నెగిటివిటీ వ‌చ్చిందో తెలిసింది. 27ఏళ్లకే కెరీర్, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో అనేక ఎదురుదెబ్బ‌లు.. అయినా బాధ‌ప‌డను. అదే ధైర్యంతో ముందుకు వెళ్లి జీవితంలో సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తాను అంటూ షన్నూ చెప్పుకొచ్చాడు.

Read Also : Bheemla Nayak Fan : భీమ్లా నాయక్ మూవీ టికెట్ కోసం బాలుడు ఆత్మ‌హ‌త్య‌..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel