Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ కంటెస్టెంట్ సిరిపై సీరియల్ హీరో నందు షాకింగ్ కామెంట్స్..!

Bigg Boss 5 Telugu : తెలుగు తెర మీద ఎన్నో సినిమాల్లో ఉత్తరాది భామలే మెరుస్తూ ఉంటారు. ఈ విషయంలో చాలా మంది ప్రేక్షకులు కూడా అసహనానికి లోనవుతారు. అసలు తెలుగు భామలను హీరోయిన్లుగా దర్శక నిర్మాతలు ఎందుకు ఎంపిక చేయరని ప్రశ్నిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు నాట పుట్టిన ముద్దుగుమ్మలు కూడా హాట్, హాట్ పోజులతో నెట్టింటిని షేక్ చేస్తున్నారు. ఉత్తరాది భామలకు ఏమాత్రం తీసిపోకుండా స్కిన్ షో చేస్తున్నారు. అంతలా తెలుగు ముద్దుగుమ్మలు దూసుకుపోతుంటే ... Read more

By Vinod Kumar

Published on: November 17, 2021 1:07 AM

Updated on: December 7, 2022 1:20 PM

actor-nanda-kishore-shocking-comments-on-siri-hanmanth-in-bigg-boss-5-telugu

---Advertisement---

Bigg Boss 5 Telugu : తెలుగు తెర మీద ఎన్నో సినిమాల్లో ఉత్తరాది భామలే మెరుస్తూ ఉంటారు. ఈ విషయంలో చాలా మంది ప్రేక్షకులు కూడా అసహనానికి లోనవుతారు. అసలు తెలుగు భామలను హీరోయిన్లుగా దర్శక నిర్మాతలు ఎందుకు ఎంపిక చేయరని ప్రశ్నిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు నాట పుట్టిన ముద్దుగుమ్మలు కూడా హాట్, హాట్ పోజులతో నెట్టింటిని షేక్ చేస్తున్నారు.

ఉత్తరాది భామలకు ఏమాత్రం తీసిపోకుండా స్కిన్ షో చేస్తున్నారు. అంతలా తెలుగు ముద్దుగుమ్మలు దూసుకుపోతుంటే దర్శక నిర్మాతలు మాత్రం ఎక్కువగా ఉత్తరాది భామలనే నమ్ముతారు. వారికే చాన్సులు ఇచ్చి స్టార్ హీరోల పక్కన ఆడిపాడిస్తారు. మన తెలుగు ముద్దుగుమ్మలను వారు ఎందుకు పట్టించుకోరు? ఇదే విషయంపై నటుడు, సీరియల్ యాక్టర్ అయిన నంద కిషోర్  స్పందించారు.

actor-nanda-kishore-shocking-comments-on-siri-hanmanth-in-bigg-boss-5-telugu
actor nanda kishore shocking comments siri hanmanth

నంద కిషోర్ హీరోగా శ్రీరాజ్ భళ్లా దర్శకత్వంలో జూలై 30 2021న థియేటర్లలో విడుదలైన నరసింహపురం అనే సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ ని హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. కానీ ఈ సినమాను మాత్రం ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ చిత్ర హీరో నంద కిషోర్ సిరిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము ప్రమోషన్ల కోసం పిలిస్తే సిరి రాలేదని ఆరోపించారు.

అంతే కాకుండా తన క్యారెక్టర్ ను తక్కువ చేసి చూపించారని చెప్పిందని వాపోయారు. సిరి వింత ప్రవర్తనతో తమ టీం సభ్యులు విసిగిపోయారని చెప్పుకొచ్చారు. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇస్తే ఇలా చేస్తారని ఆయన చెప్పుకొచ్చాడు. ట్రైలర్ ను సరిగ్గా కట్ చేయలేదని సిరి ఆరోపించిందని.. ఇది జోక్ అని అన్నారు. ట్రైలర్ కట్ కు సినిమాకు సంబంధం ఉండదనే విషయం కూడా తనకు తెలియదా అని ప్రశ్నించారు.

Read Also : Kothagudem Raja Ravindra: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో కోటి గెల్చిన కొత్తగూడెం పోలీస్..!

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!