Bigg Boss 5 Telugu : షణ్ముక్ మెంటాలిటీ ఎలాంటిదో చెప్పిన రవి.. బిగ్‌బాస్ చాలా దాస్తున్నాడట!

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ గేమ్ షో గురించి అందులోని కంటెస్టెంట్స్ గురించి యాంకర్ రవి ఎలిమినేషన్ అయ్యాక ఇంటిని వదిలి వెళ్లేటప్పుడు చెప్పిన విషయాలను ఎవరూ మర్చిపోలేరు. అయితే, రవి సడన్‌ ఎలిమినేషన్ అందరినీ షాక్ కు గురి చేశాయి. ఇకపోతే రవి బయటకు పోవడానికి ప్రధాన కారణం షణ్ముక్, మహాతల్లి సిరి అని అందరూ అనుకుంటున్నారు.

వీరిద్దరే రవిని చాలా సార్లు నామినేషన్స్‌లో ఉండేలా చేశారు. రవి షణ్ముక్‌కు క్లోజ్ అవ్వడానికి చూస్తే షన్నూ మాత్రం రవి పెద్ద ఇన్ఫ్లూయెన్సర్ అని, అందరి మధ్యలో గొడవలు సృష్టిస్తు్న్నాడని, ఎవరినైనా తొక్కడానికి ఎంతకైనా తెగిస్తాడని అబద్ధాలు చెప్పి ఇక్కడి దాకా తెచ్చాడు షణ్ముక్.. ఇక అపర బ్రహ్మా ఏది చెబితే మహాతల్లి సిరి కూడా అదే చేస్తుంది.. అందుకే రవి ఎక్కువ సార్లు నామినేషన్స్‌లో నిలిచాడు.

తీరా రవి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాక అతనిపై జంట పాములు ఎక్కడలేని ప్రేమను వల్లెబోశాయి. మిస్ యూ రవి అంటూ షన్నూ ఓవరాక్షన్ చేస్తే సిరమ్మ ఏకంగా నాకు రవి కలలో కనిపిస్తున్నాడు అంటూ ఆస్కార్ యాక్టింగ్ చేసింది. ఇదంతా రవి అభిమానుల ఓట్లకోసమే అని ఎవరికైనా అనుమానం రాకుండా ఉండదు. ఇక వీరిద్దరూ కలిసి భావోద్వేగానికి గురైనట్టు తెగ నటించేశారు. షన్నూ మాత్రం తాను విన్నర్‌గా నిలవాలని అందరినీ ఏదో ఒక ట్రాప్‌లో పడవేస్తుంటాడు. ఏకంగా సభ్యులకు ఓట్లు వేస్తున్న ఫ్యాన్స్‌ను తిట్టడం మొదలెట్టేశాడు.

Advertisement

తాజాగా రవి షణ్ముక్ గురించి బిగ్‌బాస్ షోలో ఏం జరుగుతుందో అసలు విషయాలు వెల్లడించాడు. షన్నూ ఏదైనా చెప్తే వింటాడు గానీ చాలా టైం తీసుకుంటాడని పేర్కొన్నాడు. ఏది అంత త్వరగా అర్థం చేసుకోలేడని గంటలు లేదా రోజుల వ్యవధి తీసుకుంటాడని చెప్పాడు. షన్నూను దగ్గరికి తీసుకుందామని చూస్తే వాడు కావాలనే ఒంటరిగా గేమ్ ఆడుకోవాలని ఇతరులను పక్కన పెడుతుంటాడని చెప్పాడు. వాడికి సాయం చేయాలని చూస్తే నన్నే ఫిటింగ్ మాస్టర్ అన్నాడంటూ చెప్పుకొచ్చాడు.

ఇక బిగ్ బాస్ షోలో జరిగే చాలా విషయాలు టెలికాస్ట్ కావడం లేదు. టీఆర్పీ రేటింగ్స్ కోసం, ఏదైతే హైలెట్ అవుతాయి అనుకుంటారో.. రొమాన్స్, గొడవ వంటికి ఎక్కువగా చూపిస్తారని వెల్లడించాడు. బిగ్‌బాస్‌కు తప్పని తెలిసినా రేటింగ్స్ కోసం, అందరూ మాట్లాడుకునేలా గేమ్ ప్లాన్ చేస్తారని స్పష్టంచేశాడు రవి.

Read Also : Bigg Boss 5 Telugu : సిరి, షన్నూ మధ్యలో రాజుకున్న వివాదం.. కాజల్‌ను వెళ్లగొట్టేందుకు ప్లాన్..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel