...

Bigg Boss 5 Telugu : సిరి, షన్నూ మధ్యలో రాజుకున్న వివాదం.. కాజల్‌ను వెళ్లగొట్టేందుకు ప్లాన్..?

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్-5 ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ కూడా దగ్గరకు వచ్చింది. ఈసారి బిగ్‌బాస్ ఎవరిని బయటకు పంపిస్తాడో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత వారం ప్రియాంక ఎలిమినేట్ అవ్వగా ఈసారి సిరి లేదా కాజల్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్లక తప్పదు.. షణ్ముక్ ఉన్నన్నీ డేస్ సిరి కూడా డోకా ఏమీ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో షన్నూ, సిరి, మానస్, కాజల్, శ్రీరామ్, సన్నీ మొత్తం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే ఈ వారం కాజల్ లేదా సిరి బయటకు వెళ్లొచ్చని తెలుస్తోంది.

Advertisement

అయితే, షణ్ముక్ నామినేషన్స్‌లో లేడు. దీంతో సిరి సేఫ్ అని చెప్పవచ్చు. షన్నూ ఫ్యాన్స్ ఓట్స్ సిరికి గంపగుత్తగా పడతాయి. ఇక మానస్, కాజల్ ఇద్దరూ నామినేషన్స్‌లో ఉన్నారు. కాబట్టి మానస్ ఫ్యాన్స్ ఈసారి కాజల్‌ను సేవ్ చేయలేకపోవచ్చు. ఇదిలాఉండగా శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో సిరి, షణ్ముక్ ఇద్దరూ గొడవ పడతారు. అయితే, ఇది గేమ్‌లో భాగంగా కాజల్‌ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కిచెన్‌లో సిరి దోశెలు పోస్తుండగా షన్నూ వచ్చి కాజల్ కాలుతుందని అంటుందని చెబుతాడు ఎవ‌రికి కాలితే ఎవ‌రు ఊరుకుంటాడు అని సిరి రియాక్ట్ అవుతుంది. మీరిద్దరూ బాగానే ఉంటారు. మధ్యలో నేనే అంటూ ఏదో నసుగుతుండగా మ‌ళ్లీ మొదలెట్టకు షన్నూ అంటూ గట్టిగా అరుస్తుంది సిరి.

Advertisement

ప్రోమోలో మాత్రం వీరిద్దరూ కాజల్ గురించి డిస్కషన్ పెట్టినట్టు కనిపిస్తుంది. అప్పటివరకు బాగానే ఉన్న సిరి ఒక్కసారిగా షణ్ముక్ మీద సీరియస్ అవ్వడంతో లేచి వెళ్లిపోతాడు. సాధారణంగా ప్రతీ ఎపిసోడ్‌లో వీరిద్దరూ కలిసి హగ్గులు, ముద్దులు, రొమాన్స్ చూసిన వారంతా వీరి గొడవ చూస్తే కావాలనే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్‌లో తెలివిగా తప్పించుకునేందుకు ఇలా చేస్తు్న్నారా? అని అనుమానం రాక మానదు.. ఇక కాజల్, మానస్ వంటింట్లో దోశెలు పోసుకుని తింటారు. కాగా, అక్కడున్న వేస్ట్ క్లాత్‌ను కాజల్ అంటించడానికి చూస్తు్న్నట్టు ప్రోమోలో కనిపిస్తుంది. అంతముందు దీనిని సిరి, షణ్ముక్ కలిసి ఉపయోగించారు. అంటే వీరికి చెక్ పెట్టేందుకు కాజల్ ఇలా కాల్చడానికి సిద్ధపడిందా అన్న అనుమానమైతే రాక మానదు.

Advertisement

Read Also : Single Wife Two Husbands : ఒకే భార్య ఇద్దరు భర్తలు.. నాకు కావాలంటే.. నాకంటూ కొట్లాట.. చివరికి ఊహించని ట్విస్ట్..!!

Advertisement
Advertisement