Guppedantha Manasu january 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధార వాళ్ల నాన్నలో వచ్చిన మార్పును చూసి సంతోష పడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్లో రిషి వసు అన్న మాటలు తలుచుకొని ఎందుకు ఇలా చేశావు వసుధార
అనుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఇంతలోనే వసుధార వెనకాల ఫాలో అవుతూ ఉండడంతో వెంటనే నీడను చూసి నన్ను ఫాలో అవుతున్నది నువ్వే అని తెలుసు వసుధార ముందుకు వచ్చేయ్ అనడంతో వసుధార ఎదురుగా వచ్చిన నిలబడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు వసుధార ఎందుకు నన్ను వెంటాడుతున్నావు అనడంతో నేను మీతో మాట్లాడాలి సార్ అని అంటుంది. అసలు నీకు ఏమయింది ప్రతిసారి మాట్లాడాలి అంటున్నావు నువ్వు ఏం చెప్పినా కూడా నేను వినను అని అంటాడు.

Advertisement
Guppedantha Manasu january 26 Today Episode
Guppedantha Manasu january 26 Today Episode

నన్ను విసిగించకు వసుధార అని వెళ్లి పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార అక్కడికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయడంతో కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మొబైల్ ఫోన్లో రిషి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి ఏంటమ్మా నిద్రపోలేదా అనగా నిద్ర పట్టడం లేదు నాన్న అని అంటుంది. రిషి సార్ గుర్తుకు వచ్చాడా అని అనడంతో అదేం లేదు నాన్న అనగా అమ్మ వసు ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో రిషి సారి ఏమన్నా కూడా కోపగించుకోకు రిషి సార్ మనసు బంగారం అయినా నేను రిషి సార్ గురించి నీకు చెప్పాల్సిన పనిలేదు సార్ చాలా మంచివారు అని అంటాడు చక్రపాణి.

నీ మాటలు రిషి సార్ వినకపోతే చెప్పు నేను వెళ్లి వాళ్ళ కాళ్లు పట్టుకొని ఒప్పిస్తాను అనడంతో అయ్యో నాన్న వద్దు నాన్న అంటుంది వసు. ఇప్పుడు వసుధర ఏడుస్తూ నాన్న నేను ఎంత చెప్పాలని ప్రయత్నించినా కూడా వీలు పడడం లేదు అని చక్రపాణిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు జగతి, మహేంద్ర రిషి గురించి ఆలోచిస్తూ వసుధార చేసిన పనికి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఆ తర్వాత రిషి ఆలోచిస్తూ ఉండగా పదే పదే వసుధార మెడలో తాళి గుర్తుకు రావడంతో ఏంటి వసుధార ఏది అయితే నేను మర్చిపోవాలి అనుకుంటున్నాను దాన్ని మర్చిపోలేక పోతున్నాను అనుకుంటూ ఉండగా ఇంతలో వసుధర రిషి కి ఫోన్ చేసి నేను మినిస్టర్ గారిని వెళ్తున్నాను నాతో పాటు రండి సార్ అని అంటుంది.

Advertisement

అప్పుడు రిషి ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు. తరువాత వసు క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కాలేజీ ఫ్యాకల్టీ వస్తారు. మేడం మన మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లాలి ఒకసారి ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి చదవండి అనడంతో వాళ్ళు చదవకుండా వసుధార పెళ్లి గురించి మాట్లాడుతూ ఉండడంతో వెంటనే వసుధార అవుతుంది. మేడం మీకు చదవమని చెప్పనా లేకపోతే నా గురించి మాట్లాడమని ఇచ్చానా, అయిన నా పెళ్లి నా భర్త ఎవరు అతను ఏం చేస్తాడు ఇవన్నీ కూడా నా వ్యక్తిగతం అవన్నీ మీకు అవసరం లేదు అని సీరియస్ అవుతుంది. ఆ తర్వాత కాలేజీ ఫ్యాకల్టీ వసుధార కలిసి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుండగా మధ్యలో కార్ ట్రబుల్ ఇవ్వడంతో అక్కడ నిలబడి ఉంటారు.

అక్కడికి వచ్చి మొదటి రోజే మినిస్టర్ గారి దగ్గరికి లేటుగా వెళ్తే బాగుండదు. నా కార్లో డ్రాప్ చేస్తాను అని అంటూ కాలేజీ ఫ్యాకల్టీ వసుధార ఇద్దరు కలిసి రిషి కార్లో కూర్చోగా వసుధార వెనుక వైపు కూర్చోవడంతో వసుని చూసి మన మధ్య ఎంత దూరం వచ్చింది వసుధార అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు రిషి. అప్పుడు కాలేజీ ఫ్యాకల్టీ మేడం కావాలనే రిషి, వసు లను బాధ పెట్టాలి అని వసుధర పెళ్లి టాపిక్ తీస్తుంది. దాంతో వసుధార రిషి ఇద్దరు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.

Advertisement

Read Also : Guppedantha Manasu january 25 Today Episode : వసుధారపై సీరియస్ అయిన జగతి.. వసు దగ్గరికి వచ్చిన చక్రపాణి?

Advertisement