Guppedantha Manasu january 25 Today Episode : వసుధారపై సీరియస్ అయిన జగతి.. వసు దగ్గరికి వచ్చిన చక్రపాణి?

Guppedantha Manasu january 25 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు …

Read more

Updated on: January 25, 2023

Guppedantha Manasu january 25 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవయానికి, వసుధార స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర, జగతి వసుధార క్యాబిన్లోకి వెళ్ళగా అక్కడ దేవయాని ఉండడంతో అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరు ఏంటి అక్కయ్య ఇక్కడ అని అనడంతో మీరంటే ఆ వసు విషయంలో ఫెయిల్ అయ్యారు అందుకే నా సైన్ లో డీల్ చేద్దామని వచ్చాను అంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదిన అని మహేంద్ర అనడంతో కాలేజీకి పట్టిన దరిద్రాన్ని అంటుండగా ఇంతలోనే ఎక్కడికి వసుధరా వస్తుంది. అప్పుడు వసు లోపలికి వచ్చి నమస్తే మేడం వెల్కమ్ టు మై క్యాబిన్ అనడంతో మై కాలేజ్ అని అంటుంది దేవయాని. మీ కాలేజ్ కావచ్చు అది నా సీట్.

Guppedantha Manasu january 25 Today Episode
Guppedantha Manasu january 25 Today Episode

మీరు ఎలా కూర్చుంటారు మీరు కూర్చోవాలి అనుకుంటే రిషి సారు క్యాబిన్లో కూర్చోండి ఎండి అవ్వండి అని అనడంతో చూశారా మహేంద్ర ఎలా మాట్లాడుతుందో అని అంటుంది దేవయాని. నేను జగతి వాళ్ళ లాగా కాదు కొంచెం హార్డ్, నీకు మర్యాదగా చెబుతున్నాను నీ కాలేజ్ నుంచి వెళ్ళిపోతారా లేదా అని అనడంతో వెళ్తాను మేడం కానీ ఆరోజు మీరే కదా నన్ను ఓటు వేసి గెలిపించింది. ఇప్పుడు మళ్లీ ఓట్లు వేసి నన్ను ఓడించండి అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది. రిషికి ఫోన్ చేస్తుండగా ఏం చేస్తున్నావు అనడంతో రిషి సార్ కి ఫోన్ చేస్తున్నాను అనగా వెంటనే వసుధార మొబైల్ ఫోన్ లాక్కుంటుంది దేవయాని.

Advertisement

ఓకే మేడం నేను రిషి సార్ దగ్గరికి వెళ్ళాలి. రిషి సార్ ని కలిసి అర్జెంట్ గా ఒక విషయం చెప్పాలి అనడంతో దేవయాని వసుధర వైపు చూడగా మీరేమి టెన్షన్ పడకండి నేను ఈ విషయం రిషి సార్ కి చెప్పను అని స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వసు. మరొకవైపు రిషి తలనొప్పిగా అనిపించడంతో పడుకుంటాడు. ఇంతలోనే వసుధార రావడంతో స్టాఫ్ బాయ్ అనుకొని వెరీ గుడ్ తొందరగా వచ్చావు. అక్కడ బామ్ ఉంది తలకు రాయి అనడంతో అప్పుడు వసు తలకు బామ్ రాస్తుండగా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీకేం పని అనడంతో మీతో మాట్లాడాలని వచ్చాను సార్ అనగా ఈరోజు ఇక్కడ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి మీటింగ్ జరగలేదు కదా, అయినా నువ్వు వచ్చి ఇలా తలకు బాంబ్ రాయడం సరైన పద్ధతి కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపో వసుధార అంటాడు రిషి.

Guppedantha Manasu january 25 Today Episode
Guppedantha Manasu january 25 Today Episode

నేను మీతో మాట్లాడాలి సార్ నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వండి అనగా నేను నీతో మాట్లాడను. నువ్వు ఏం చెప్పిన కూడా నేను వినను అంటాడు రిషి. మీరు వినకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది నేను చెప్తాను సార్ అని అనగా వసుధార ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీటింగ్ మొదలవుతుంది. వసుధార గారు కాలేజ్ లో మిషన్ ప్రాజెక్టు హెడ్ గా ఉంటున్నారు తనకు మనం ప్రోత్సాహాన్ని అందించాలి అనడంతో సరే అని అంటాడు ఫణీంద్ర. అప్పుడు తనకు ఇంకొక వ్యక్తి సహాయం కావాలి అనగా జగతి మేడం సహాయం తీసుకో వసుధార అనడంతో స్వారీ సార్ నాకు కుదరదు అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది జగతి.

ఆ తర్వాత మీటింగ్ ఓవర్ అని రిషి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుండగా నాకు చెప్పండి సార్ అనడంతో చేతులు జోడించి ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత జగతి ఒంటరిగా ఉండగా ఏంటి మేడం నాతో కలిసి పని చేయడం మీకు ఇష్టం లేదా అనగా అవును ఇందాకే చెప్పాను కదా మళ్లీ ఎందుకు అడుగుతున్నావ్ అంటూ వసుధార మీద సీరియస్ అవుతుంది జగతి. అప్పుడు వసుధార రిషితో ప్రవర్తిస్తున్న తీరుని తప్పుపడుతూ తన మీద సీరియస్ అవుతుంది జగతి. మరొకవైపు వసుధార ఇంటికి చక్రపాణి రావడంతో సంతోషపడుతూ ఉంటుంది.

Advertisement

రిషి సార్ ని కలిసావా జరిగింది మొత్తం వివరించావా అనడంతో లేదు నాన్న చెప్పాలి అని అంటుంది వసుధార. సరే వస్తున్నారా నేను కూడా వాళ్ళని చాలా మాటలు అని బాధ పెట్టాను వాళ్ళ కాళ్లపై పడే క్షమాపణలు అడిగి నిన్ను రిషి సార్ ని కలుపుతాను అనడంతో అయ్యో నాన్న వద్దు నేను నిదానంగా మాట్లాడే రిషి సార్ ఇ ఒప్పిస్తాను అంటుంది వసుధార. ఇక ఎప్పటికీ నేను మీ అమ్మ నీతోనే ఉంటాను. పెళ్లయి పిల్లలు పుట్టినా కూడా ఇక్కడే ఉంటాము నువ్వు మెడబట్టి బయటకు వెళ్ళాము అనడంతో నేను మిమ్మల్ని ఎందుకు వెళ్ళమని చెబుతాను నాన్న మనమందరం కలిసే ఉందాము అనడంతో చక్రపాణి సంతోషపడుతుండగా అది చూసి వసుధార కూడా దాంతోష పడుతూ ఉంటుంది.

Read Also : Guppedantha Manasu january 21 Today Episode : వసుధార కోసం ఇంటిని అరేంజ్ చేసిన రిషి.. సంతోషంలో వసు?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel