Guppedantha Manasu january 21 Today Episode : వసుధార కోసం ఇంటిని అరేంజ్ చేసిన రిషి.. సంతోషంలో వసు?

Guppedantha Manasu january 21 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవయాని జగతి దంపతులపై సీరియస్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఫణీంద్ర జరిగింది ఏదో జరిగిపోయింది కదా దేవయాని అనగా దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి కదా అంటుంది.

అయినా నువ్వేం మాట్లాడవేంటి జగతి అనడంతో ఏం మాట్లాడాలి అక్కయ్య జరిగింది మొత్తం మీకు తెలుసు కదా అనగా నాకు తెలిసి కూడా నేను ఏం చేయలేకపోతున్నాను అనుకొని రగిలిపోతూ ఉంటుంది దేవయాని. అప్పుడు మహేంద్ర నీకు రిషి కాలేజీలో ఉన్నాడని ఎవరు చెప్పారు అనడంతో వసుధారం పెట్టిన వాయిస్ మెసేజ్ వినిపిస్తాడు మహేంద్ర. దాంతో దేవయాని మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Advertisement
Guppedantha Manasu january 21 Today Episode
Guppedantha Manasu january 21 Today Episode

అంటే రిషి ని మనం వదిలిపెట్టామని రిషి బాధ్యతను మనకు గుర్తు చేస్తుందా అనుకుంటూ ఉంటుంది దేవయాని. మరొకవైపు సుమిత్రతో ప్రేమగా మాట్లాడుతూ సుమిత్రకు సేవలు చేస్తూ ఉంటాడు చక్రపాణి. అది చూసి సుమిత్ర సంతోషపడుతూ ఉండగా ఇంతలోనే రాజీవ్ చక్రపాణి కి ఫోన్ చేయగా ఫోన్ లో రాజీవ్ నెంబర్ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు చక్రపాణి. అప్పుడు మామయ్య గారు అనడంతో చి అని పిలవకు అనగా అదేంటి మామయ్య అల్లుడు దేవుడు అని అన్న నోటితోనే దౌర్భాగ్యుడు అంటున్నారు అనడంతో నువ్వు పారిపోయి బతికిపోయావు కానీ లేదంటే నిన్ను చంపేసే వాడిని అనడంతో నువ్వు నన్ను చంపలేవు మామయ్య ఎందుకంటే నువ్వు మంచి వాడివి ఎంతో కూల్ గా మాట్లాడుతాడు.

ఆ మంచితనాన్ని అడ్డుపెట్టుకొని నువ్వు నన్ను చేతగాని వాడిని చేశావు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు చక్రపాణి. అప్పుడు మావయ్య నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలని ఉంది అనడంతో జీవితంలో నా నీ ముఖం నాకు చూపించకు అని కోపంగా ఫోన్ కట్ చేస్తాడు చక్రపాణి. అప్పుడు చక్రపాణి ఆవేశపడుతూ ఉండగా ఆవేశపడకండి కూల్ గా ఉండండి అంటుంది సుమిత్ర. మరొకవైపు రిషి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే పుష్ప క్యారేజీ తీసుకొని వచ్చి ఇది వసుధారకు ఇవ్వండి సార్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే రిషి దగ్గరికి జగతి వస్తుంది.

Advertisement

అప్పుడు రిషి ప్రాజెక్టు హెడ్ గారు వసుధార గారు వచ్చారు నన్ను కలిశారు అనడంతో జగతి ఏంటి రిషి ఇంతకూల్ గా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి జగతి చేతికి తాళాలు ఇచ్చి ఇది మన ప్రాజెక్ట్ హెడ్ గారు వసుధార కీ ఇవ్వండి. గౌతమ్ ఫ్లాట్ కి వెళ్ళమని చెప్పండి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా వసుధార కీ బాధితులు కల్పించాల్సిన బాధ్యత మన కాలేజీ పై ఉంది అనడంతో అప్పుడు జగతి రిషి వసుధార మీద కోపంగా లేదా అనగా ఎవరికోపాలకు ఎవరిని బాధ్యులను చేస్తాము మేడం అని అంటాడు. వీలైనంత తొందరగా మన ప్రాజెక్ట్ హెడ్ ని ఆ ఫ్లాట్ కిస్ షిఫ్ట్ అవమని చెప్పండి.

ఇది పుష్ప ఇచ్చింది ప్రాజెక్టు హెడ్ గారికి ఇవ్వండి అని అంటాడు. మరోవైపు వసు బాధపడుతూ ఆరోజు నేను ఉన్న పరిస్థితులలో అలా ప్రవర్తించాల్సి వచ్చింది అందరూ హర్ట్ అయ్యారు కానీ నేను ఒక్కసారి చెప్పేది వినాలి కదా నా ప్రాబ్లం ని ఎవరు అర్థం చేసుకోవడం లేదు అనుకుంటూ ఉండగా ఇంతలోనే జగతి అక్కడికి వస్తుంది. అప్పుడు జగతి వసుధారకు కీస్ ఇచ్చి ప్రాజెక్టు హెడ్ గారు నీకు ఇవ్వమని చెప్పారు అనడంతో వసుధార సంతోష పడుతూ ఉంటుంది. తర్వాత పుష్ప క్యారేజ్ ఇచ్చింది అని చెప్పి వసుధారకు ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతుంది జగతి.

Advertisement

అప్పుడు వసుధార కనీసం నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు అని బాధపడుతూ రిషి సార్ నా మీద ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు అని కీస్ ని చూసి సంతోషపడుతూ ఉంటుంది. మరొకవైపు దేవయాని కోపంతో రగిలిపోతూ ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది ఇప్పుడు రిషి వెనక్కి వచ్చాడు ఆ వసుధర కూడా వచ్చింది కొంపదీసి వీళ్లిద్దరూ ఒకటవుతారా?ఒకటి అవుతారా ఏంటి ఒకటి అవుతాడు కరిగిపోతాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవయాని రాజుకి ఫోన్ చేసి రేయ్ ఎక్కడ చచ్చావ్ రా అనడంతో ఏంటి రేయ్ అంటున్నారు మీకు మర్యాద ఇచ్చాను ఆ మర్యాద నిలబెట్టుకోండి అనడంతో మరింకేమనాలి డబ్బులు ఇచ్చాను అవకాశం ఇచ్చాను కానీ చెప్పిన పని చేయకుండా చేతకాని దద్దమ్మల తప్పించుకొని తిరుగుతున్నావు అని దేవయాని అనడంతో రాజీవ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

Read Also : Karthika Deepam january 21 Today Episode : కార్తీక్ ని చంపేయాలి అనుకున్న మోనిత.. మోనిత ఊహించని షాక్ ఇచ్చిన దీప?

Advertisement