Guppedantha Manasu: వసుధారను చూసి కుళ్లుకుంటున్న దేవయాని.. రిషితో కలిసి ఎంజాయ్ చేస్తున్న వసు.?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి జగతితో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి డాడీ కి మీరు అంటే ఎంత ఇష్టం అనేది మీ కంటే నాకే బాగా తెలుసు. బహుశా ఈ విషయం మీకు తెలియదేమో. డాడ్ ఆనందం కోసం నేను ఏమైనా చేస్తాను అందుకే నేను మిమ్మల్ని ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేశాను. డాడీ ప్రేమను అర్థం చేసుకోండి.. అంతేకానీ కొత్త బంధాలు కొత్త అర్థాలు వెతుక్కోకండి. నీ మీద నాకు ఉన్నది కేవలం గౌరవం మాత్రమే అని అంటాడు రిషి. మీరు డాడ్ దగ్గర ఉంటే డాడ్ ఆనందంగా ఉంటారు డాడ్ ఆనందంగా ఉండడమే నాకు కావాలి.

Advertisement

డాడ్ ఆనందంగా నా కళ్ళముందు తిరగాలి అని అంటాడు రిషి. అప్పుడు జగతి వసుధార గురించి మాట్లాడగా నేను వసుధారని మీ శిష్యురాలు అని చెప్పి ఇష్టపడలేదు తనని తనగానే ఇష్టపడ్డాను ప్రేమించాను అని అంటాడు రిషి. మేడం వసుధార నాతో కలిసి చివరి వరకు ప్రయాణం చేస్తుంది ఇందులో ఎటువంటి మార్పు లేదు అని అనగా జగతి సంతోషపడుతుంది. అప్పుడు జగతి, మహేంద్ర అంటే ప్రేమ అన్నావు నేనంటే గౌరవం అన్నావు కానీ నేను ఎప్పటికీ జగతి మేడం గానే గౌరవాన్ని అందుకోవాల రిషి అని అడుగుతుంది జగతి.

జీవితాంతం మేడం అనే పిలుపుతోనే సరిపెట్టుకోవాల నాకు తల్లిగా ఉండే అర్హత దొరకదా రాదా రిషి ఆ పిలుపుకు నేను నోచుకోలేనా అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది జగతి. అప్పుడు రిషి జగతి మాటలు విని మౌనంగా ఉండగా ఇంతలో వసుధార అక్కడికి వచ్చి ఏం జరిగింది మేడం ఎందుకు మౌనంగా ఉన్నారు అనడంతో మేడంని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరొకవైపు గౌతమ్ రిషి, మహేంద్రల ఫోటో చూస్తూ రిషి గాడికి అసలు విషయం తెలిస్తే నన్ను కోప్పడతాడు నన్ను కనీసం ఫ్రెండ్ గా అయినా యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని భయపడుతూ ఉండగా ఇందులో మహేంద్ర ఫోన్ చేస్తాడు.

నువ్వేం భయపడకు గౌతం అన్ని సర్దుకుంటాయి నువ్వు చెప్పవు నేను చెప్పవు ఎలా తెలుస్తుంది ధైర్యంగా ఉండు అని అంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుండగా నువ్వు కూడా తిను అని ఫణీంద్ర అనగా నేను జగతి మేడంకి భోజనం తీసుకుని వెళుతున్నాను సార్ అని అంటుంది. అప్పుడు మహేంద్ర వసు గురించి పొగడడంతో దేవయాని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ జగతికి వసు ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. మరొకవైపు రిషి భోజనం చేయకుండా పైకి లేవగా ఏమయింది అని అడగడంతో ఒకటే తింటుంది కదా పెదనాన్న తనకు కంపెనీ ఇస్తాను అని అనగా ఆ మాట విన్న దేవయని అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు ధరణి కూర్చోవడంతో ధరణికి తినడానికి వడ్డిస్తాడు రిషి. ఆ తర్వాత రిషి వసు ఏం చేస్తుందా అని మెసేజ్ చేసి బయటికి రా అనడంతో చెప్పండి సార్ అని అనగా కొద్దిసేపు నీ సమయం నాకు కావాలి అని మనిద్దరం బయటకు వెళ్తున్నాం అని అంటాడు. ఇంతలో ధరణి అక్కడికి రావడంతో వదినా మేమిద్దరం బయటకు వెళ్తున్నాం అని అనగా ధరణి సరే అని అంటుంది. ఆ తర్వాత బయటకు వెళ్లిన వసుధర, రిషి ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి చాలా సంతోషంగా కనిపించడంతో వసు చూసి సంతోష పడుతూ ఉంటుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel