Karthika Deepam November 22 Today Episode : సౌర్య ప్లాన్ ని చెడగొట్టిన చంద్రమ్మ దంపతులు.. దీపను చూసి బాధపడుతున్న కార్తీక్?

Updated on: November 22, 2022

Karthika Deepam November 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్య కనపడలేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు చంద్రమ్మ దంపతులు.

ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య అక్కడికి రావడంతో ఇందిరమ్మ దంపతులు ఇక్కడికి వెళ్లావమ్మా అని అనడంతో ఇక్కడికే బాబాయ్ జిరాక్స్ దగ్గరికి వెళ్లాను అని అనగా ఎందుకు అని చెప్పడంతో శౌర్య తన చేతిలో ఉన్న పోస్టర్స్ ఇంద్రుడికి చూపించడంతో ఇంద్రుడు ఒకసారిగా షాక్ అవుతాడు. మా అమ్మ నాన్నల ఫోటోలు నా దగ్గర లేవు అందుకే నా పోటు వేపించి వీటిపై మీ నెంబర్ వేపించాను బాబాయ్ అని అనడంతో ఆ మాట విన్న ఇంద్రుడు దంపతులు షాక్ అవుతారు. అప్పుడు వెళ్దాం పద బాబాయ్ అనడంతో ఇప్పుడు కాదమ్మా రేపు ఉదయాన్నే వెళ్దాం అని అంటాడు.

Karthika Deepam November 22 Today Episode
Karthika Deepam November 22 Today Episode

మరొకవైపు కార్తీక్ డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది నాలుగు రోజుల్లో అతని డిశ్చార్జ్ చేయండి అని చెబుతాడు. ఆ తర్వాత కార్తీక్ కి డాక్టర్ డబ్బులు ఇవ్వడంతో వెంటనే కార్తీక్ మన మోనిత కు మొన్న చైన్ అమ్మాను అని చెప్పాను ఈరోజు ఉంగరం తాకట్టు పెట్టానని చెప్పాలి లేకపోతే అనుమాన పడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు మోనిత కార్తీక్ ని అదేపనిగా ఫాలో అయితే ఎక్కడికి తప్పించుకుని వెళ్ళాడు నేను బాగానే ఫాలో అయ్యాను కదా అసలు ఏం చేస్తున్నాడు అర్థం కావడం లేదు అని మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

ఆ తర్వాత కార్తీక్ కోసం దీప ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా అప్పుడు మోనిత కు శౌర్య ఇంద్రుడు దంపతులతో కలిసి దిగిన ఫోటో ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అంటే ఈ శౌర్య ఆటో వాడి దగ్గర ఉందా అందుకే నన్ను ఆరోజు కార్తీక్ అనుమానించింది అనుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దీప అక్కడికి వచ్చి నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నీకు ఇక్కడ ఏం పనుంది అని మోనిత చేతిలో ఉన్న ఆ ఫోటోని లాక్కుంటుంది దీప. ఏంటి నీ కూతురు దొరికిందా వంటలక్క అని అడుగుతూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి రావడంతో ఇదిగో కార్తీక్ వంటలక్క కూతురు అని అనడంతో వెంటనే కార్తీక్ నువ్వు సౌర్యని ఇంతకుముందు ఎక్కడైనా చూసావా అని పదేపదే మోనిత ను ప్రశ్నించడంతో కోపడుతుంది మోనిత.

Karthika Deepam నవంబర్ 22 ఎపిసోడ్ : దీపను చూసి బాధపడుతున్న కార్తీక్..

మరి నువ్వు ఎక్కడికి వెళ్లావు కార్తీక్ అని అనడంతో ఉంగరం తాకట్టు పెట్టడానికి వెళ్లాను అని అనగా మోనిత కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండు దీప అని మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. అప్పుడు దీప కు కళ్ళు తిరగడంతో వెళ్లి పడుకుంటుంది. మరొకవైపు ఇంద్రుడు సౌర్య ఇద్దరు కలిసి పోస్టర్స్ అతికిస్తూ వెళ్తూ ఉండగా సౌర్యకు కనిపించకుండా సౌర్యకు తెలియకుండా వెనకాలే చంద్రమ్మ ఆ పోస్టర్స్ కనిపించకుండా పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కార్తీక్ దీప ఇంటికి రాగా అప్పుడు దీప పడుకుని ఉండడంతో ఏమైంది వంటలు అక్క పడుకున్నావు అని అడగగా నాలుగైదు రోజుల నుంచి నాకు చాలా నీరసంగా ఉంటుంది డాక్టర్ బాబు అని అంటుంది.

అప్పుడు కార్తీక్ దీపను చూసి బాధపడుతూ ఉంటాడు. సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద అని అనడంతో లేదు డాక్టర్ బాబు నా కూతుర్ని చూస్తే చాలు నాకు బాగా అయిపోతుంది అనడంతో అది నిజమేలే కానీ నువ్వు టైం టు టైం సరిగా తిను దీప అప్పుడే నువ్వు వెతకగలవు అని అనడంతో సరే డాక్టర్ బాబు అని అంటుంది దీప. సరే నువ్వు రెస్ట్ తీసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మరొకవైపు మోనిత ఇంటికి వెళ్ళగా అక్కడ తాళాలు వేసి ఉండడంతో కొంపదీసి సౌందర్య ఆంటీ వచ్చిందా అనుకొని కిటికీలోకి తొంగి చూడగా ఇంతలో అక్కడికి దుర్గా వస్తాడు. అప్పుడు దుర్గా ఏంటి బంగారం ఇలా వచ్చావు అని అడగాలి ఫస్ట్ వచ్చి తలుపులు తీరా అని అంటుంది మోనిత.

Advertisement

నేను తీయని బంగారం నువ్వు కార్తీక్ బాబు దీపమ్మ లోపల ఉన్నప్పుడు నువ్వు ఎవరి తల పగలగొట్టావు అది ఎవరో చెబితే తాళాలు తీస్తాను లేదంటే తీయను అని అంటుంది. ఏ నీకేమైనా పిచ్చా నిన్ను ఎవరిని చంపలేదు అనడంతో సరే నేను కూడా ఇలాగే ఉంటాను ఇప్పుడు కార్తీక్ బాబు వస్తే ఏం చెప్తావో నీ ఇష్టం అని బ్లాక్ మెయిల్ చేస్తాడు దుర్గ. చెప్తావా లేదా అనడంతో నేను ఎవరిని చంపలేదు చెప్పను చెప్పను అని అంటుంది మోనిత. ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు.

Read Also : Karthika Deepam: క్షీణించిన దీప ఆరోగ్యం.. సౌర్య చేసిన పనికి షాక్ అయిన చంద్రమ్మ దంపతులు..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel