...

Hero Srikanth Comments : రోజాతో ‘రొమాన్స్’ అంటే మూడ్ ఆఫ్ అయ్యేది.. షాకింగ్ నిజాలు చెప్పిన హీరో శ్రీకాంత్

Hero Srikanth Comments : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని చెప్పొచ్చు. కెరీర్ ఆరంభంలో నెగెటివ్ పాత్రల్లో నటించిన శ్రీకాంత్.. ఆ తర్వాత హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చాలా దగ్గరయ్యాడు. చిత్ర పరిశ్రమలో నటుడిగా శ్రీకాంత్‌కు చాలా అనుభవం ఉంది. ఎంతో మంది సీనియర్ నటీనటులతో యాక్ట్ చేశారు. తన కోస్టార్ అయిన ‘ఊహ’ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ అనంతరం ఊహ సినిమాలకు దూరం అయ్యింది. టాలీవుడ్‌లో హీరోగా శ్రీకాంత్ వందకు పైగా చిత్రాల్లో నటించాడంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే శ్రీకాంత్ వ్యక్తిగతంగా ఎలాంటి కాంట్రవర్సీలకు పోలేదు. తన కెరీర్ మీదే దృష్టి సారించే వారని ఇండస్ట్రీలో టాక్..

Advertisement

ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. హీరోగా శ్రీకాంత్‌కు చివరి హిట్ సినిమా అంటే ‘ఆపరేషన్ దుర్యోదన’ అని చెప్పుకోవాలి. నటుడు, కమెడియన్ పోసాని కృష్ణ మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహించి చిత్ర పరిశ్రమలో అందరినీ షాక్‌కు గురిచేశాడు. ప్రస్తుతం శ్రీకాంత్ కుర్ర హీరోలకు బాబాయ్, మామ, తండ్రి వంటి పాత్రల్లో కనిపిస్తున్నారు. రీసెంట్‌గా విలన్ అవతారం కూడా ఎత్తారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆఖండ’ మూవీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు శ్రీకాంత్..

Advertisement

అయితే, శ్రీకాంత్ హీరోగా మంచి ఫాంలో ఉన్న రోజుల్లో ప్రస్తుత సీనియర్ హీరోయిన్స్ రోజా, సౌందర్య, ఆమని, మీనా వంటి నటీమణులతో వెండి తెరపై రొమాన్స్ చేశారు. అయితే, రోజాతో రొమాన్స్ చేయాల్సి వస్తే చాలా ఇబ్బందులు పడేవాడినని ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు శ్రీకాంత్.. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు మంచి రిలేషన్‌ను మెయింటెన్ చేస్తారని అందరికీ తెలిసిందే.

Advertisement

రోజా మాత్రం షూటింగ్ ఉన్నప్పుడే కాకుండా లేని సమయాల్లో కూడా అన్నయ్య అని పిలచేదట.. ఈ ఒక్క పదమే తన కొంపముంచేదని శ్రీకాంత్ వెల్లడించారు. దర్శకుడు రోజాతో రొమాన్స్ సీన్ ప్లాన్ చేసినప్పడు తను అన్నయ్య ఇలా చేద్దాం.. అలా చేద్దాం.. అనేదని గుర్తుచేసేదట.. ఓ రోజు శ్రీకాంత్ కోపంగా.. ఏహే ఉండవమ్మా.. నువ్వు అన్నయ్య అని పిలిస్తే నాకు మూడ్ ఆఫ్ అయిపోతుందని ఓ రోజు రోజా మీద కసురుకున్నట్టు చెప్పుకొచ్చారు హీరో శ్రీకాంత్.

Advertisement

Read Also : Bigg Boss 5 Telugu : షణ్ముక్‌కు షాకిచ్చిన సిరి తల్లి.. నా బిడ్డను నువ్వు అలా పట్టుకోవడం నాకు నచ్చలే..?

Advertisement
Advertisement