Guppedantha Manasu serial Oct 12 Today Episode : దేవయానికి తగిన విధంగా బుద్ధి చెప్పిన వసు.. రిషి ప్రేమతో కానుక ఇచ్చిన వసు..?

Updated on: October 12, 2022

Guppedantha Manasu serial Oct 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి,జగతితో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు.  ఈరోజు ఎపిసోడ్ లో రిషి మీరు రాకముందు డాడీ ఒంటరిగా ఉన్నారు మీరు వచ్చిన తర్వాత సంతోషంగా ఉన్నారు మేడం అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. అది చూసి జగతి షాక్ అవుతుంది. ఇప్పుడు రిషి చెప్పాల్సింది చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర అక్కడికి వచ్చి జగతి రిషి అన్న మాటలకు బాధపడొద్దు అని అనగా బాధ కాదు మహేందర్ రిషి తాను అనుభవించిన కష్టాల గురించి మాటలను చెప్పాడు.

Rishi feels happy as Vasudhara gives him a gift in todays guppedantha manasu serial episode
Rishi feels happy as Vasudhara gives him a gift in todays guppedantha manasu serial episode

రిషి చెప్పినా ఒక్కొక్క మాటలు తూటాల్లా నా గుండెను గుచ్చుకున్నాయి అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది జగతి. రిషి ని ఆనంద పెట్టాలి బాధ పెట్టకూడదు మహేంద్ర ఇది నువ్వు కూడా గుర్తుంచుకో అని చెబుతుంది. మరొకవైపు వసుధార ఆటోలో వస్తూ రిషి గురించి ఆలోచిస్తూ ఆ బొమ్మలు సార్ కీ ఇస్తే సార్ చాలా సంతోషిస్తాడు అని అనుకుంటూ ఉంటుంది.

గుప్పెడంత మనసు సీరియల్ అక్టోబర్ 12 ఈరోజు ఎపిసోడ్ :రిషి ప్రేమతో కానుక ఇచ్చిన వసు..

ఆ తర్వాత రిషి మెసేజ్ చూస్తూ ఆటో దిగి వెళ్తూ అనుకోకుండా రిషి, వసు ఒకరికొకరు గుద్దుకుంటారు. అప్పుడు మళ్లీ ఇంకొకసారి చేయాలి సార్ లేకపోతే కొమ్ములు వస్తాయి అని అనడంతో రిషి అటు ఇటు చూసి మళ్ళీ వసు తలకు డాష్ ఇస్తాడు. ఆ తర్వాత రిషి మీ మేడం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళు అని చెప్పగా వసు వెళుతూ ఉండగా అప్పుడు రిషి ఇక పై మనము పికప్ లు, డ్రాప్లు ఉండకూడదు అంటే ఏం చేయాలి అనడంతో మనిద్దరం ఒకే చోట ఉండాలి సార్ అని అంటుంది వసు.

Advertisement

ఎప్పుడు అనేది నువ్వే డిసైడ్ చెయ్ అని అనడంతో వెంటనే అక్కడికి దేవయాని రావడం చూసి వసు, రిషి షాక్ అవుతారు. ఇప్పుడు దేవయాని ఏం మాట్లాడుతున్నారు అని అనటంతో వసుధార,దేవయానికి తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొక వైపు రిషి జగతితో చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ వెళుతూ ఉంటాడు. మరొకవైపు జగతి మహిళలు వసుదార గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి వస్తుంది.

వసు తో పాటు గౌతమ్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు వసు అక్కడికి వచ్చి జగతి మేడంకి ఇష్టమైన పని చేస్తున్నాను సార్ అని చెబుతుంది. అప్పుడు జగతి ఒకప్పుడు రిషి ని చూస్తే భయమేసేది ఇప్పుడు నేను చూస్తే భయమేస్తోంది వసు అని అంటుంది. ఆ తర్వాత వారందరు దేవయాని గురించి అనుకొని శ్రద్ధగా నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు రిషి, మహేంద్ర జగతిల గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసు వస్తుంది.

అప్పుడు వసు, రిషి కోసం ఒక గిఫ్ట్ తీసుకొని వస్తుంది. అప్పుడు రిషి అది చూసి సంతోష పడతాడు. అప్పుడు రిషి, వసు ఇద్దరూ ఆ బొమ్మలను చూసి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే వసుధర మీరు పర్మిషన్ ఇస్తే ఇంట్లో బొమ్మలు కొలువు పెడతాను అని అనడంతో అందుకు రిషి సరే అని అంటాడు. దాంతో వసు సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి ఈ బొమ్మకి ఏదో తక్కువయ్యింది అని వసుదరా కంటి కాటుక తీసి బొమ్మకు దిష్టి చుక్క పెడతాడు. అప్పుడు వసు తనకు దిష్టి చుక్క పెట్టినట్టుగా ఊహించుకొని సంతోష పడుతూ ఉంటుంది.

Advertisement

Read Also : Guppedantha Manasu: దేవయానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వసు.. జగతితో ఎమోషనల్ గా మాట్లాడిన రిషి..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel