Kalyan Dev: మెగా అల్లుడి రెండవ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా?

Kalyan Dev: సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకి రెండవ పెళ్లి సర్వసాధారణం. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా చాలా గుర్తింపు పొందిన ఎంతోమంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న మెగా కుటుంబంలో కూడా ఇలా రెండు మూడు పెళ్లిళ్లు జరిగాయి. మెగా హీరో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుంది. మొదట ఇంటి నుండి పారిపోయి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న శ్రీజ కొంతకాలం తర్వాత అతనితో మనస్పర్ధలు రావడం వల్ల అతనికి దూరమయింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో కళ్యాణ్ దేవ్ ని రెండవ వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది.

అయితే గత కొంతకాలంగా శ్రీజ, కళ్యాణ్ దేవ్ మద్య మనస్పర్ధలు వచ్చి వీరిద్దరూ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చాలాకాలంగా మెగా కుటుంబంలో జరిగే వేడుకలలో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడంతో ఈ వార్తలు మరింత వైరల్ గా మారాయి. ఇక కొన్ని రోజులుగా శ్రీజ మూడవ వివాహాం గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Kalyan Dev:

శ్రీజ రెండవ భర్త కల్యాణ్ దేవ్ ఆమెతో విడిపోయి రెండవ వివాహాం చేసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా శ్రీజకి దూరంగా ఉంటున్న కళ్యాణ్ రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమ బంధువులలో మరదలు వరుస అయ్యే అమ్మాయిని కళ్యాణ్ దేవ్ రెండవ వివాహం చేసుకుంటున్నట్లు సమాచారం. కళ్యాణ్ దేవ్ స్నేహితుల వల్ల ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ అయినట్లు తెలుస్తోంది. శ్రీజ మూడవ వివాహానికి సిద్ధం అవ్వడంతో కళ్యాణ్ దేవ్ కూడా ఏమాత్రం తగ్గకుండా రెండవ పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ రెండవ పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel