Bheemla Nayak Movie : వైరల్‌గా మారిన పవన్ కళ్యాణ్, రానా ” భీమ్లా నాయక్ “మూవీ రన్ టైమ్…

Updated on: January 25, 2022

Bheemla Nayak Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “ భీమ్లా నాయక్ “. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది కానీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25న అని అనౌన్స్ చేశారు.

కానీ ఇప్పుడు ఆరోజున కూడా సినిమా వచ్చే ఛాన్స్ లేదు. రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా చోట్లా కర్ఫ్యూలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా రాదనే అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘భీమ్లానాయక్’ లెంగ్త్ 130 నిమిషాలని తెలుస్తోంది.

మొదట 2 గంటల 20 నిమిషాల వరకు ఫస్ట్ కాపీ వచ్చిందట. కానీ ఇలాంటి ఎమోషనల్ డ్రామా రేసీ స్క్రీన్ ప్లేతో ఉంటేనే కరెక్ట్ అని భావించి మరో పది నిమిషాల సన్నివేశాలను ఎడిట్ చేశారట. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు స్క్రీన్ ప్లే ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read Also : Anchor Rashmi : రహస్యంగా వివాహం చేసుకున్న యాంకర్ రష్మీ… ఎవరినంటే!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel