Guppedantha Manasu Aug 18 Today Episode : దేవయానికి గోరుముద్దలు తినిపించిన రిషి.. ఆనందంతో పొంగిపోతున్న జగతి..?

Guppedantha Manasu Aug 18 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినందుకు మహేంద్ర, గౌతమ్ రెస్టారెంట్ లో పార్టీ చేసుకోవాలని అనుకుంటారు. ఈరోజు ఎపిసోడ్ లో జగదీదంపతులు, గౌతమ్ రెస్టారెంట్ లో ఉండగా ఇంతలోనే అక్కడికి వసుధార రిషి వస్తారు. వసు, రిషి కలిసి రావడంతో మహేంద్ర దంపతులు షాక్ అవుతారు. అప్పుడు రిషి ఎందుకు వచ్చారు అని అనగా వెంటనే గౌతమ్ కేక్ అంటూ నోరు జారతాడు. ఇంతలోనే మహేంద్ర కేకే రావు నా ఫ్రెండ్ నీ కలవడానికి వచ్చాను అంటూ కవర్ చేస్తాడు.

Jagathi feels elated by Rishi's request in todays guppedantha manasu serial episode
Jagathi feels elated by Rishi’s request in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu Aug 18 Today Episode : ఆనందంతో పొంగిపోతున్న జగతి..

అప్పుడు వెంటనే మహేంద్ర మీరిద్దరూ ఎందుకు కలుసుకున్నారు అని అడగగా రిషి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకే కలిసాము అంటూ అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. ఆ తర్వాత రిషి వసు ను కాఫీ తీసుకురమ్మనీ చెప్పగా అప్పుడు మహేంద్ర వర్మ రిషి ని బుక్ చేయాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత వసు కాఫీ తీసుకుని రావడంతో ఇద్దరు కూర్చుని కాఫీని షేర్ చేసుకుంటారు. అది చూసి జగతి దంపతులు మురిసిపోతూ ఉంటారు.

చీకటి పడటంతో అందరూ భోజనానికి కూర్చోగా దేవయాని మాత్రం అక్కడికి రాదు. అప్పుడు రిషి పెద్దమ్మ ఎక్కడ అని అడగగా ధరణి ఎందుకో అత్తయ్య గారు కాస్త డల్ గా ఉన్నారు అని చెప్పడంతో వెంటనే రిషి భోజనం తీసుకొని దేవయాని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు జగతి కాస్త ఎమోషనల్ అయ్యి తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

అప్పుడు రిషి దేవయానికి అన్నం తినిపిస్తూ ఉండగా అప్పుడు దేవయాని తన మనసులో రిషికి నా మీద చాలా ప్రేమ ఉంది కానీ అది నాటకం అని తెలిస్తే నన్ను రిషి క్షమించడు అని అనుకుంటుంది. అప్పుడు దేవయాని సాక్షి గురించి మాట్లాడగా ఆ విషయం గురించి మాట్లాడొద్దు పెద్దమ్మ అని అంటాడు రిషి.

అంతేకాదు నా ముందు నటించేవాళ్లు నాకు నచ్చరు అనడంతో దేవయాని ఆలోచనలో పడుతుంది. మరొకవైపు జగతి వారిద్దరిని చూసి రిషి తనకు అన్నం తినిపిస్తున్నట్లుగా ఊహించుకుంటుంది. ఇంతలోనే మహేంద్ర అక్కడికి వచ్చి తొందర్లోనే వదిన బాగోతం బయటపడుతుంది అని అంటాడు. ఆ తర్వాత వసుధారకి రిషి భోజనం పంపించడంతో వసు ఆశ్చర్య పోతుంది.

మరుసటి రోజు ఉదయం రిషి కాఫీ కోసం కిచెన్ లోకి వెళ్లి వదిన కాఫీ అని అడుగుతాడు. అప్పుడు అక్కడ జగతి ఉంటుంది. అప్పుడు జగతి నేను ఇవ్వనా సార్ అని అనగా సరే అని చెప్పి మేడం నాది చిన్న రిక్వెస్ట్ ఇప్పటినుంచి నన్ను చూసి సార్ అని పిలవకండి రిషి అని పిలవండి అనడంతో జగతి సంతోషపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న మహేంద్ర కూడా సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు జగతి, కాఫీ చేసి కాఫీ తీసుకొని సంతోషంగా అంటుంది.

Advertisement

Read Also : Guppedantha Manasu Aug 17 Today Episode : నన్ను రిషి అని పిలువు అని చెప్పిన రిషి.. సంతోషంలో జగతి..?

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel