Guppedantha Manasu july 11 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, ని ఇంటిదగ్గర డ్రాప్ చేయడానికి రిషి కార్ లో ఎక్కించుకొని వెళ్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర దంపతులు గౌతమ్ ఒక కారులో వెళుతూ ఉంటారు. అప్పుడు గౌతమ్ ఎలా అయిన వసు,రిషి ఒకే కారులో పంపించేలా చేశాము అని అనగా వెంటనే మహేంద్ర వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారో లేదో అని అనడంతో వెంటనే జగతి తాను వసుపై కోప్పడిన విషయాన్ని చెబుతుంది. అప్పుడు మహేంద్ర ఎలా అయినా వసు, రిషి లు కలవాలి,కలపాలి అని అంటాడు.

మరొకవైపు వసు,రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా అప్పుడు రిషి,వసు కోసం మెడిసిన్స్ తీసి ఇస్తాడు. అప్పుడు వసుధార,రిషి గురించి మనసులో గొప్పగా అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి కాలేజీ పైన ఎందుకు అలా చేశావు, సమయానికి తినాలి అని తెలియదా అంటూ వస్తదారకి క్లాస్ పీకుతాడు. ఆ తర్వాత కారు ఒక చోట నిలబెట్టి ఇద్దరు కలిసి కొబ్బరి నీళ్లు తాగుతారు.
ఆ తరువాత రిషి నా కారు టైరులో నువ్వే గాలి తీసేసావు కదా అని వసుని అడగగా వసు మాత్రం ఆ మాట చెప్పకుండా మాట మారుస్తూ ఉంటుంది. అప్పుడు వసు ఇన్ని రోజులు మన పరిశ్రమంలో ఎప్పుడైనా మీరు సినిమాకి తీసుకుని వెళ్లారా అని అనగా రిషి కూడా మాట మారుస్తాడు.
ఇంతలోనే రిషికి సాక్షి ఫోన్ చేయడంతో అప్పుడు రిషి కాస్త ప్రేమగా మాట్లాడగా, అప్పుడు వస్తాదార మధ్యలో కలుగజేసుకోవడంతో వెంటనే రిషి ఫోన్ కట్ చేస్తాడు. ఒకప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ శిరీష్ తో క్లోజ్ గా ఉన్నప్పుడు నాకు అలాగే అనిపించింది అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత వాసుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు.
Guppedantha Manasu :గుప్పెడంత మనసు సీరియల్ దేవయాని మరొక ప్లాన్ వేస్తుంది..
ఆ తరువాత సాక్షి, దేవయానితో ఆ వసు,రిషి మళ్ళీ కలిసి తిరుగుతున్నారు అని అనడంతో దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంతేకాదు రిషి లో మార్పు వచ్చింది నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు అని అనడంతో దేవయాని సంతోషపడుతుంది. మరొకవైపు మహేంద్ర జగతీలు, వసుధార,రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇక వారి మాటలు విన్న దేవయాని మరొక ప్లాన్ వేస్తుంది. ఆ తర్వాత రిషి గౌతమ్ కి వసుధార కి ఫోన్ చేయమని చెప్పగా వెంటనే గౌతమ్ ఫోన్ చేసి రిషి ఫోన్ చేయమని చెప్పాడు అని అంటాడు. దాంతో రిషి ఒక్కసారిగా అడ్డంగా దొరికిపోతాడు. ఆ తర్వాత రిషి, సాక్షి ల విషయంలో వారి మధ్య ఏం జరుగుతుంది అని వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది.
- Guppedantha Manasu: రిషి ప్రేమ పరీక్షలో గెలిచిన వసు..సంతోషంలో జగతి దంపతులు..?
- Guppedantha Manas seurial Sep 7 Today Episode : వసుధారని తన ఇంటిలో పర్మినెంట్ గా ఉండిపోమని అడిగిన రిషి.. సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?
- Guppedantha Manasu Aug 29 Today Episode : ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండలేకపోతున్న వసు, రిషి.. ఆనందంలో మహేంద్ర..?
















