Malli Nindu Jabili Serial Aug 17 Today Episode : మీరాతో రిలేషన్‌పై శరత్ చంద్రను నిలదీసిన వసుంధర.. మల్లితో పెళ్లిపై ఆందోళనలో అరవింద్!

Malli Nindu Jabili Serial Aug 17 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న మల్లి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా శరత్ చంద్ర లెటర్ మీద మీరా పేరును చూసి షాక్ అవుతాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది ఇప్పుడు చూద్దాం. శరత్ చంద్ర లెటర్ మీద ఉన్న మీరా అనే పేరును చూసి మల్లి తన కూతురు అని అనుకుంటాడు. ఇక మల్లి గురించి తలచుకొని బాధపడతాడు. ఇక అరవింద్ వాళ్ల సార్ సత్య తో జరపాల్సిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతాడు. అప్పుడు అరవింద్ సత్య ఇంటర్వ్యూ కి వస్తా అన్నాడు. కానీ ప్రభుత్వం అతనితో శాంతి చర్చలు జరగనివ్వకుండా కాల్పులకి సిద్ధమైంది. సత్య నాతో ప్రభుత్వం ఇలాగే శాంతి చర్చలు జరుపుతామని చెప్పి మమ్మల్ని చాలా సార్లు మోసం చేశారు అన్నాడు సార్. ఇక వాళ్ళు చర్చలకు సిద్ధంగా లేరు ప్రభుత్వం మీద తిరగబడాలి అని చూస్తున్నారు సార్. నేను ఇప్పుడు ఈ స్టొరీని తయారు చేస్తున్నాను అంటాడు.

Advertisement
malli-nindu-jabili-serial-aravind-gets-worried-about-his-marriage-to-malli-sharath-and-vasundhara-have-a-heated-argument
malli-nindu-jabili-serial-aravind-gets-worried-about-his-marriage-to-malli-sharath-and-vasundhara-have-a-heated-argument

ఇక శరత్చంద్ర మల్లి నిద్రపోతుంటే తన దగ్గర కూర్చొని తల్లి నిజంగా మీ నాన్న పిరికి వాడే 18 సంవత్సరాల క్రితం మీ అమ్మను ప్రేమించి అక్కడే వదిలేసి వచ్చాడు. మా ప్రేమకు ప్రతిరూపంగా నువ్వు మీ అమ్మ కడుపులో పెరుగుతున్నవని నాకు నిజంగా తెలియదు తల్లి కానీ నేను నిన్ను చూసినప్పుడల్లా మన మధ్య ఏదో ఒక సంబంధం ఉందనిపించేది అది రక్తసంబంధం అని ఈరోజే తెలిసింది. నువ్వు ఇన్ని రోజులు నా దగ్గరే ఉన్నా నువ్వు నా కూతురు అని నేను గుర్తు పట్టలేదు కనీసం నువ్వు మీ అమ్మ పేరు చెప్పిన నువ్వు నా కూతురు అని నాకు ఎప్పుడో తెలిసి ఉండేది. నిన్ను గుర్తుపట్టలేని దౌర్భాగ్య స్థితిలో నీ తండ్రి ఉన్నాడు అమ్మ అని బాధ పడతాడు. ఇక మీరాను తలచుకుని నా కోసం మీ అమ్మ ఇన్నాళ్లుగా ఒంటరిగా ఉందా ఊర్లో వాళ్ళ మాటలు పడుకుంటూ కనీసం నా పేరు కూడా ఎప్పుడు బయటపెట్టలేదు మీరు వేరే పెళ్లి చేసుకుని ఉంటుందని నేను భ్రమపడ
ఉంటుందని నేను భ్రమపడ్డాను అని చెప్పి బాధపడతాడు.

Advertisement

నువ్వు ఇన్నాళ్లుగా మీ నాన్న పేరు కూడా తెలుసుకోకుండా పెరిగావా తల్లి. ఇక మీరు ఇద్దరూ ఎన్ని బాధలు పడ్డారో తలుచుకుంటే నామీద నాకే కోపం వస్తుంది నన్ను క్షమించు తల్లి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అరవింద్ లోపలికి వస్తాడు. మాలిని నువ్వు మీ అమ్మని ఎంత మిస్ అవుతున్నావా చెప్పింది. అందుకే నీ కోసం ఒకటి తీసుకొచ్చాను అని చెప్పి మల్లి మరియు వాళ్ళ అమ్మ కలిసి దిగిన ఫోటో ని అక్కడ ఉంచుతాడు. ఇక శరత్చంద్ర మీరా పెయింటింగ్ చూస్తూ నన్ను క్షమించు మీరా నిన్ను నా భార్యగా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్నా కానీ కొన్ని బంధాల వల్ల నా అక్కడే వదిలేసి రావడం జరిగింది. నువ్వు ఇక్కడికి రాకపోవడమే మంచిది అనుకున్నాను. నువ్వు అక్కడ చాలా సంతోషంగా ఉంటావ్ అనుకున్నాను.

Advertisement
malli-nindu-jabili-serial-aravind-gets-worried-about-his-marriage-to-malli-sharath-and-vasundhara-have-a-heated-argument
malli-nindu-jabili-serial-aravind-gets-worried-about-his-marriage-to-malli-sharath-and-vasundhara-have-a-heated-argument

నువ్వు నన్ను ఒక మోసగాడుగా భావించి మళ్లీ పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు నా కోసం ఎదురుచూస్తూ గొప్ప త్యాగం చేశావు. మనకి పెళ్లి కాకుండా మనం భార్యాభర్తలుగా ఉన్న విషయం మర్చిపోయాను. నిజంగా నీ కడుపులో మన ప్రతిరూపం పెరుగుతుందని నాకు తెలియదు. తెలిస్తే నిన్ను బాధపెట్టే వాడ్ని కాదు ఈరోజు మన బిడ్డ ని చూశాను. హాస్పిటల్ బెడ్ మీద పడి ఉంది. కనీసం మనస్ఫూర్తిగా కూడా హత్తుకోలేకపోయాను నన్ను క్షమించు మీరా అని చెప్పి బాధపడతాడు. వసుంధర అక్కడికి వచ్చి ఏంటి మీరు పెయింటింగ్ తో మాట్లాడుతున్నారు ఇంతకుముందు ఎప్పుడూ అలా చేయలేదు కదా మీరు ఈ ఒక్క పెయింటింగ్ తోనే మాట్లాడతారా లేకపోతే వేరే ఆడవాళ్ళ పెయింటింగ్స్తో కూడా మాట్లాడతారా అంటుంది. అప్పుడు శరత్చంద్ర నాకు ఇప్పుడు నీతో మాట్లాడాలని లేదు వెళ్ళిపో అంటాడు.

Advertisement

Malli Nindu Jabili Serial  Aug 17 Today Episode : వసుంధర మాటలు మాలినిలో అనుమానాన్ని రేకెత్తించాయా..

అప్పుడు వసుంధర మీరు అనాధ పిల్లలకి బాక్స్ తీసుకెళ్లారు కదా వాళ్లు తిన్నారా ఇక ముందు ఎప్పుడూ తీసుకెళ్లలేదు కదా ఇప్పుడు ఎందుకు తీసుఎప్పుడూ తీసుకెళ్లలేదు కదా ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతుంది. అసలు మీ అవతారం ఒకసారి చూసుకున్నారా చేరిగిపోయిన జుట్టు, మడతలు పడిన షర్టు, ఎర్రగా మారిన కళ్ళు ఏంటి తాగి వచ్చారా అంటుంది. అప్పుడు శరత్ చంద్ర నా గురించి నీకు ఇది ఒక్కటే తెలుసు అని గట్టిగా అరుస్తాడు. నా గురించి నీకు అవసరం లేదు అంటాడు. అప్పుడు వసుంధర నేను మీ భార్య ని తెలుసుకునే హక్కు నాకు ఉంది అంటుంది. అప్పుడు శరత్చంద్ర ఎప్పుడైనా నువ్వు నా భార్యగా ప్రవర్తించావా నా ఇష్టాల గురించి ఎప్పుడైనా తెలుసుకున్నావా అంటాడు. అప్పుడు వసుంధర మీరు ఎప్పుడైతే మీ ఇష్టాల గురించి ఆలోచించారో అప్పుడే నేను మీ గురించి ఆలోచించడం మర్చిపోయాను.

Advertisement
malli-nindu-jabili-serial-aravind-gets-worried-about-his-marriage-to-malli-sharath-and-vasundhara-have-a-heated-argument
malli-nindu-jabili-serial-aravind-gets-worried-about-his-marriage-to-malli-sharath-and-vasundhara-have-a-heated-argument

నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం మా నాన్నని ఎంత రిక్వెస్ట్ చేశాను మర్చిపోయారా అంటుంది. మీరు కరెంటు బిల్లు కూడా కట్టని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను మా నాన్నని చేయి చాచి అడిగాను ఆ విషయం మరిచిపోయారా అంటుంది. నావల్ల మీరు ఈ విలాసాలు అన్ని అనుభవిస్తున్నారు. నేనే లేకపోతే మీరు కటిక దరిద్రం లో ఉండేవారు అంటుంది. అప్పుడు శరత్చంద్ర నీతో ఉండటం కంటే దరిద్రంలో ఉండడమే మంచిది అంటాడు. నీ వల్ల మా అమ్మ మా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మన కూతురు కూడా బాధపడుతుంది. వాళ్ల అత్తమామల్ని నువ్వు ఎన్ని మాటలు అన్నా వాళ్లు పట్టించుకోకుండా మన కూతుర్ని బాగా చూసుకుంటున్నారు. లేకపోతే మన కూతురు తల్లిగారి ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది. నువ్వంటే నాకు అసహ్యం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

Advertisement

అరవింద్ మల్లి దగ్గర ఉన్న బాక్సులు తీసుకుని వచ్చి అమ్మ అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకో అంటాడు. మీ ఆడవాళ్ళకి బంగారం పోయినా పట్టించుకోరు కానీ ఒక బాక్స్ మిస్ అయినా కూడా తట్టుకోలేరు అంటాడు. అప్పుడు అనుపమ ఇవి మన బాక్సులు కాదు వేరే వాళ్ల దగ్గర దొంగతనం చేసి తీసుకు వచ్చావా అంటుంది. లేదు అమ్మ మల్లి దగ్గర ఉంటే తీసుకువచ్చాను అంటాడు. అప్పుడు మాలిని నేను మల్లి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా అంటుంది. అప్పుడు అరవింద్ నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే దారిలో తన దగ్గరికి వెళ్లి తనను కలిసి వస్తున్నాను అంటాడు. అమ్మ మల్లి రిపోర్ట్స్ సరిగా వస్తే డాక్టర్ రేపు ఇంటికి పంపిస్తాను అని చెప్పాడు అంటాడు. ఇక మాలిని మరియు అనుపమ సంతోషపడతారు. ఇక రేపు జరగబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Read Also : Malli Nindu Jabili Serial Aug 4 Today Episode : ప్రమాదం నుంచి అరవింద్‌ను కాపాడుకున్న మల్లి.. ఆ రాత్రి మల్లితోనే అరవింద్..!

Advertisement
Advertisement