Viral Video : పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించాలంటే తప్పనిసరిగా బైకు ఉండాల్సిందే. లేదంటే.. ఏదైనా బాటిల్, క్యాన్ తీసుకెళ్లినా పెట్రోల్ పోయించుకోవడం కుదరదు. రూల్ ప్రకారం.. తప్పనిసరిగా బైకు లేదా ఏదైనా వాహనం తీసుకెళ్తేనే పెట్రోల్ గానీ, డీజిల్ గానీ పోయించుకోనే అవకాశం ఉంది. అయితే ఓ కుర్రాడు మాత్రం అదేమి లేకుండానే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించాడు. బైకు లేదు.. అందులోనూ మైనర్లకు పెట్రోల్ అమ్మరు.. మరి ఎలా అని ఈ కుర్రాడు తెలివిగా ఆలోచించాడు. తన సైకిల్‌కు బైక్ పెట్రోల్ ట్యాంక్ ఫిక్స్ చేశాడు. అలా పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించాడు.
ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. పెట్రోల్ బంకుల్లో బాటిల్, క్యాన్, బైకు లేకుండానే ఎలా పెట్రోల్ తీసుకెళ్లొచ్చో ఈ కుర్రాడు చేతల్లో చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూపీలోని పిలిభిత్‌లో బైకు లేకుండా పెట్రోల్ పోయరు.. చాలా పెట్రోల్ బంకుల్లో డబ్బాలు, బాటిల్స్‌లో పెట్రోల్ నింపబడదు అని ఒక పేపర్‌పై నోటిస్ అంటిస్తున్నారు.
Viral Video : బంకులోంచి పెట్రోల్ తీసుకెళ్లిన ఈ కుర్రాడి తెలివి చూడండి..!
ఈ నేపథ్యంలో పెట్రోల్ ఎలా తెచ్చుకోవాలా? అని ఆలోచించినా ఈ కుర్రాడు ఇలా తెలివిగా సైకిల్‌పై బైక్ ఫ్యూయల్ ట్యాంక్ తీసుకుని వచ్చాడు. అతడి ఆలోచనకు పెట్రోల్ బంక్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. దాంతో చేసేది ఏమిలేక ఆ కుర్రాడి అడిగినంత పెట్రోల్ నింపి పంపించారు. పెట్రోల్ ఇలా తీసుకెళ్లొచ్చు అని ఆలోచన ఎలా వచ్చింది బాబూ అంటూ పెట్రోల్ సిబ్బంది కుర్రాడి అడిగారు.. ఓసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో బాబు అనగానే.. సిగ్గుతో ఆ పిల్లాడు ముఖం కనిపించకుండా దాచుకున్నాడు.
ఇదంతా అక్కడి మరో వ్యక్తి వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా.. ఈ కుర్రాడు తెలివికి నెటిజన్లు నవ్వేసుకుంటున్నారు. చిన్నపిల్లలకు పెట్రోల్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని, అది నేరం కూడా అని బంక్ సిబ్బందికి నెటిజన్లు సూచిస్తున్నారు.
Read Also : Wrong challan : వాళ్లు ఇలా చేస్తే.. మీరు ట్రాఫిక్ ఛలాన్లు కట్టాల్సిన అవసరం లేదు!