Dhee 14 Season : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. బుల్లితెరకు అంతేకాకుండా వెండితెరకు ఎంతో మంది డాన్సర్స్ ని పరిచయం చేసింది. దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరొందింది. ఈ షో సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ నెంబర్1 దూకుపోతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 14 వ సీజన్ జరుపుకుంటుంది. ది డాన్సింగ్ ఐకాన్ పేరిట ప్రసారమవుతున్న ఈ సీజన్ గతంలో మాదిరి కాకుండా మొత్తం కొత్త వాళ్ళని తీసుకువచ్చారు. నాలుగు జట్లు ఇందులో పోటీ పడుతున్నాయి. దీనికి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇక ఈ సీజన్ ను కపుల్స్ ,ఛాంపియన్స్, లేడీస్ టీం ల మధ్య పోటీ గా మొదలు పెట్టారు. ఇందులో హైపర్ ఆది ఒక టీం నవ్య స్వామి మరియు రవి కృష్ణ లు మరొక టీం ఇక కొంత మంది సెలబ్రిటీలు మిగిలిన టీం కి మెంబర్స్ గా వ్యవహరిస్తున్నారు. జడ్జీలుగా గణేష్ మాస్టర్, శ్రద్ధ దాస్ మరియు నందిత శ్వేతా లు ఉన్నారు. యాంకర్ ప్రదీప్ పోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
Dhee 14 Season : ‘ఢీ‘ షోలో ఏమైంది.. శ్రద్ధదాస్‌కు అవమానం.. ప్రోమో కోసమేనా..?
డాన్సింగ్ ఐకాన్ సీజన్ లో ప్రతివారం సరికొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేస్తున్నారు. ఇక బుధవారం ప్రసారమవుతున్న ఎపిసోడ్ లో కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండ్ నిర్వహించబోతున్నారు. అంటే కంటెస్టెంట్స్ తో పాటు కొరియోగ్రాఫర్ కూడా డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక చైతన్య మాస్టర్ రాజశేఖర్ పాటలకు డాన్స్ చేస్తాడు.
దీంతో గతంలో ఆ స్టార్ హీరో తో చేసిన శ్రద్ధ దాస్ వచ్చి అదిరిపోయే స్టెప్పులు వేస్తుంది. దీంతో పిల్లల టీం కి సపోర్ట్ గా ఉన్న కిరణ్ మచ్చ అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. ప్రదీప్ చెప్పిన ఆగడు. మా పిల్లలు కూడా మంచిగానే డాన్స్ చేశారు. కానీ మేడం అప్పుడు రాలేదు. చైతన్య మాస్టర్ పాటకి వచ్చి డాన్స్ చేసింది. మేడం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అంటూ ప్రదీప్ తో గొడవ కి దిగుతాడు. ఆ తరువాత శ్రద్ధాదాస్ కూడా అతనితో గొడవ పడుతుంది. దీంతో ఇది పెద్ద వివాదం అయింది.
కిరణ్ మచ్చ యాంకర్ ప్రదీప్ మరియు హైపర్ ఆది తో కూడా తీవ్రమైన పదజాలంతో గొడవ పెట్టుకుంటాడు. చివరికి ఇది పెద్ద రాద్ధాంతం అవుతుంది. దీంతో శ్రద్ధాదాస్ ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళి పోతుంది. అంతేకాదు యాంకర్ ప్రదీప్ కూడా కోపంతో అక్కడి నుండి వెళ్ళి పోతాడు. దీంతో ఇది సంచలనం అవుతుంది. ఈ ప్రోమో వీడియో ని ఢీ షో నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు . ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also : Anchor Rashmi : ఏంటి.. యాంకర్ రష్మీ నవ్వుల వెనుక ఇన్ని కష్టాలా.. స్టేజ్‌పైనే బోరుమని ఏడ్చేసింది..!