Anchor Pradeep : ప్రముఖ టీవీ షో కి గుడ్ బై చెప్పనున్న ప్రదీప్.. ఆ షో పరిస్థితి ఏంటి..?

Updated on: June 20, 2022

Anchor Pradeep : బుల్లితెర మీద లేడీ యాంకర్ లతో పాటు కొంతమంది మేల్ యాంకర్స్ కూడా సందడి చేస్తున్నారు. అటువంటి వారిలో రవి, ప్రదీప్, సుధీర్ వంటి వారు బాగా పాపులర్ అయ్యారు. ఇక బుల్లితెర ప్రేక్షకులలో యాంకర్ ప్రదీప్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించిన ప్రదీప్ తన యాంకరింగ్ తో పాటు కామెడీ టైమింగ్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రదీప్ ఇలా యాంకర్ గా మాత్రమే కాకుండా నటుడిగా కూడా మంచిగుర్తింపు పొందాడు. కొంత కాలం చిన్న చిన్న పాత్రలలో నటించిన ప్రదీప్ .. “వంద రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాలో హీరోగా కూడా నటించాడు.

Anchor Pradeep
Anchor Pradeep

ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రదీప్ కి సంబంధించిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మా టీవీ, జీ తెలుగు, ఈటీవీ అని తేడా లేకుండా అన్ని చానల్స్ లో యాంకర్ గా ప్రదీప్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రదీప్ ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ షో కి గత కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల ప్రదీప్ ఢీ షో కి గుడ్ బై చెప్పనున్నట్టూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఢీ షో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఈ షో లో ప్రదీప్ తన యాంకరింగ్ తో పాటు కామెడీ పంచ్ లతో కూడా బాగా పాపులర్ అయ్యాడు.

ఇప్పటికే ఈ షో నుండి రష్మి, సుధీర్, శేఖర్ మాస్టర్, వంటి వారు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ షో లో ఆది, ప్రదీప్ మాత్రమే ప్రేక్షకులని ఆకట్టుకోటానికి కష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ఆది కూడా ఈ షో నుండి వెళ్ళిపోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా మల్లెమాల వారితో కుదుర్చున్న అగ్రిమెంట్ గడువు ముగియడంతో ప్రదీప్ కూడ ఈ షో ని వీడనున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ప్రదీప్, ఆది ఇద్దరు ఈ షో నుండి వెళ్ళిపోతే ఈ షో పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఇప్పటికే రష్మి, సుధీర్ వెళ్ళటం వల్ల ఈ షో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.ప్రదీప్ కూడా వెళ్ళిపోతే ఉన్న కాస్త రేటింగ్స్ కూడా పడిపోతాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Advertisement

Read Also : Anchor pradeep: హైపర్ ఆది మీద చేయి చేస్కున్న యాంకర్ ప్రదీష్.. ఎందుకంటే?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel