Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు ఒక మనిషి జీవితంలో ఎదుగుదలకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలను తన నీతి గ్రంధం ద్వారా వెల్లడించారు.ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే అతని వ్యవహార శైలి ఎలా ఉండాలి అతని అలవాట్లు ఎలా ఉండాలి? ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాల గురించి ఆచార్య చాణిక్యుడు ఎంతో అద్భుతంగా వివరించారు. ఇకపోతే ఒక ఇంట్లో తరచూ కొన్ని సంకేతాలు కనపడటం వల్ల ఆ ఇంట్లో ఆశుభాలు జరిగే సూచనలు ఉన్నాయని చాణిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా తెలిపారు. మరి ఎలాంటి సంకేతాలు ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయనే విషయానికి వస్తే…
అప్పటివరకు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో పచ్చగా ఉన్నటువంటి తులసి మొక్క ఒక్కసారిగా వాడిపోతే మన ఇంట్లో ఏదో చెడు జరగబోతుందని సంకేతం.ఈ విధంగా తులసి మొక్క ఎండిపోతాయి మిమ్మల్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని చాణిక్యుడు వెల్లడించారు. అలాగే తరచూ కుటుంబ సభ్యులు గొడవ పడటం కూడా ఆర్థిక క్షీణతకు సంకేతం. అందుకే వీలైనంత వరకు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని చానిక్యుడు తెలిపారు.
Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు ఇంట్లో ఈ సంకేతాలు కనపడుతున్నాయా మీకు బ్యాడ్ టైం ప్రారంభమైనట్లే..
ఆచార్య చానిక్యుడు నీతి గ్రంధం ప్రకారం మన ఇంట్లో ఏదైనా గాజు పెంకు పగిలిపోతే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చూసించారు.ఎప్పుడైతే మన ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉంటామో అలాంటి ఇంటిలో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని అందుకే దీపారాధన చేయాలని చాణిక్యుడు సూచించారు. దీపారాధన చేయని ఇంటిలో కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇకపోతే ఎక్కడైతే పెద్దలను అగౌరవం ఇవ్వబడతారు అక్కడ లక్ష్మీదేవి ఉండదని అలాంటివారు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని అందుకే పెద్దలను గౌరవించాలని చాణిక్యుడు సూచించారు.
Read Also : Chanakya neethi : అలాంటోళ్లను అస్సలే నమ్మకూడదట.. ఎవరో మరి మీరే చూసేయండి!