Devotional Tips: ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే చంద్రుడికి ఇది సమర్పిస్తే చాలు… సమస్యలన్నీ మటుమాయం?

Devotional Tips: సాధారణంగా మనిషి అన్న తర్వాత వారికి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఉండటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా మనుషుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఇలా ఆర్థిక ఇబ్బందులతో సతమతమతమయ్యేవారు ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవడానికి ఎన్నో పరిహారాలు పాటిస్తుంటారు. ఇలా సమస్యలు తొలగిపోవాలంటే చంద్రుడికి పరిహారం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పవచ్చు. మరి చంద్రుడికి ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయానికి వస్తే…

ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు అష్టమి నుంచి పౌర్ణమి వరకు ప్రతిరోజు సాయంత్రం చంద్రుడికి పెరుగన్నం సమర్పించడం వల్ల మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అందుకే అష్టమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుడికి పెరుగన్నం సమర్పించాలి. సాయంత్రం అన్నం చేయగానే ఎంగిలి చేయకుండా నిండుకుండ అన్నం తీసుకుని పెరుగు కలిపి చంద్రుడికి తూర్పు వైపుకు సమర్పించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇలా చంద్రుడికి పెరుగన్నం సమర్పించడంతో పాటు పేదలకు నీలిరంగు వస్త్రాలను దానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.

పౌర్ణమి రోజు చంద్రుడికి ఎక్కువ మొత్తంలో నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా అందరికీ పంచాలి.ఈ విధంగా చంద్రుడికి పెరగడం నైవేద్యం సమర్పించడంతో సంతృప్తి చెంది ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సకల సంపదలను కలిగిస్తాడు. చంద్రుడికి సమర్పించిన పెరుగన్నం ప్రసాదం గా తీసుకున్న తర్వాత ఇతర ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అష్టమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుడికి ఇలా చేయడంతో చంద్రుడు అనుగ్రహించి అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తాడు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel