Intinti Gruhalashmi july 2 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో భాగ్య లాస్య ఇంటికి రావడంతో అందరూ ఆమెని ఆటపట్టిస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో భాగ్య తులసిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. దివ్య నీకు ఒక మాట చెప్పాలి అని అక్కడ నుంచి వెళ్లిపోవడంతో అప్పుడు భాగ్య ఆ విషయం ఏదో తెలుసుకోవాలి అని అక్కడ నుంచి వెళ్తుంది.
ఆ తర్వాత దివ్య, అంకిత, తులసి ముగ్గురు కలిసి రంజిత్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు గోడచాటున నిలబడి వారి మాటలు వింటూ ఉంటుంది భాగ్య. అయితే వారి మాటలు వినడం కోసం భాగ్యబడే తిప్పలు చూస్తే తెగ నవ్వొస్తుంది. అలా కొద్దిసేపు తులసి వాళ్ళు భాగ్యనిపుతిప్పలు పెట్టి కొద్దిసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వారి మాటలు విన్న తర్వాత భాగ్య అక్కడి నుంచి వెళ్లి ఎలా అయినా ఇవన్నీ లాస్యకి చెప్పాలి అని అనుకుంటుంది.
మరొకవైపు భాగ్య ఫోన్ కోసం లాస్య ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో భాగ్య ఫోన్ చేయడంతో భాగ్య అక్కడ ఏంటి సంగతులు అని లాస్య అడగగా వెంటనే భాగ్య నీ చేతికి ఉన్న బంగారు గాజులు తీసేయి మరి కాసేపట్లో పోలీసులు నీ చేతికి సంకెళ్లు వేస్తారు అని అనడంతో లాస్య భయపడుతుంది. ఆ రంజిత్ గారి ఇంటి అడ్రస్ తులసికి తెలిసిపోయింది అనడంతో లాస్య తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఆ తర్వాత తులసి ఇంట్లోకి వెళుతూ ఉండగా ఇంతలో న్యూస్ పేపర్ లో సంగీతం కాంపిటీషన్ యాడ్ చూసి శృతి కి ఫోన్ చేస్తుంది. శృతి ప్రేమ్ ని కాంపిటీషన్ లో పాల్గొనమని చెప్పు పాల్గొంటే ఐదు లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు అనడంతో శృతి సంతోషపడుతుంది. మరొకవైపు ప్రేమ్ ఆఫీసులో ఏదో పరధ్యానంతో కూర్చొని గిటార్ వాయిస్తూ ఉంటాడు.
ఇంతలో ప్రేమ్ ఓనర్ వచ్చి కావాలనే అవమానించే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. మరొకవైపు లాస్య, భాగ్యలు స్కూటీలో వేగంగా వెళుతూ ఉంటారు. అప్పుడు వారిద్దరి మధ్య కొద్దిసేపు కామెడీ బాగా ఉంటుంది. ఇక వెనకాలే వాళ్ళను ఫాలో అవుతున్న తులసి వాళ్ళు తెగ నవ్వుకుంటూ ఉంటారు. అలా మొత్తానికి రంజిత్ ప్లేస్ కి చేరుకుంటుంది లాస్య.
రేపటి ఎపిసోడ్ లో అక్కడ రూమ్ లో రంజిత్ కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో తులసి వాళ్ళు కనిపించడంతో లాస్య భాగ్య ఇద్దరూ షాక్ అవుతారు. అప్పుడు తులసి 24 గంటల్లో నా 20 లక్షల రూపాయలు అకౌంట్ లో లేకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయి అని వార్నింగ్ ఇవ్వడంతో లాస్య శాఖ అవుతుంది. అంతేకాకుండా రంజిత్ ను తానే కిడ్నాప్ చేసినట్టు చెబుతుంది తులసి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World