Credit card : క్రెడిట్ కార్డుల ఉపయోగం రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డు లేని వారు లేరంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఒక్కొక్కరికి రెండు కంటే ఎక్కువే క్రెడిట్ కార్డులు ఉంటాయి. కార్డులు ఎన్ని ఉన్నా, ఒకటే ఉన్నా దానిని ఏ విధంగా వాడాలో మాత్రం చాలా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎక్కువ మందికి దాని వాడకం సరిగ్గా తెలియదు.
క్రెడిట్ కార్డులు ఆపదలో ఆదుకుంటాయి. కానీ వాడకం తెలియక పోతే జేబుకు పే..ద్ద చిల్లు పెడతాయి. ఛార్జీలపై ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. నెల నెలా బిల్లు వచ్చినప్పుడు కూడా దాని గురించి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. బిల్ స్టేట్ మెంట్ పై ఉండే గడువు తేదీ లోపు బకాయి మొత్తాన్ని చెల్లించమని సదరు కంపెనీ కోరుతుంది. అయితే బిల్ పేమెంట్ విషయంలో కార్డు దారులకు కొన్ని ఆప్షన్లు ఉంటాయి.
బిల్లు పూర్తిగా చెల్లించడం, చెల్లించాల్సిన బకాయిలో ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించడం, బకాయిలో కనీసం 5 శాతం చెల్లించడం అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో బిల్లు పూర్తిగా చెల్లించడం అనే ఆప్షన్ అత్యుత్తమమైనది. దీని వల్ల మన క్రెడిట్ స్కోరు పెరగడంతో పాటు ఎలాంటి ఫైన్లు పడకుండా ఉంటాయి. మిగతా రెండు ఆప్షన్లు కూడా మనపై ఎంతో కొంత భారాన్ని మోపుతాయి. కొంత వడ్డీ వేయడం లేదా ఛార్జీలు వేయడం లాంటివి ఉంటాయి. కాబట్టి క్రెడిట్ కార్డు వాడే వారు దానిని ఎంత మేరకు వాడతారో.. అంత మేర బిల్లు చెల్లించాలి. అప్పుడు దాని అత్యున్నత ప్రయోజనాలు పొందవచ్చు.
Read Also : Garuda mukku: గరుడ ముక్కు మొక్కలో పుష్కలంగా ఔషధ గుణాలు..!