Jawans yoga: నీళ్లు, ఆక్సినజన్ లేకుండా 17 వేల అడుగుల ఎత్తుపై ఐటీబీపీ జవాన్ల యోగాసనాలు..!

Jawans yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్ తో పాటు అనేక దేశాల్లో నేడు సామూహిక యోగసనాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఐటీబీపీ సిబ్బంది లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లతో పాటు భారత్ – చైనా సరిహద్దుల్లోని వివిధ ఎత్తైన హిమాలయ శ్రేణుల్లో యోగా ఆసనాలు వేశారు. ఉత్తరాన లడఖ్ నుంచి తూర్పున ఉన్న సిక్కిం వరకు 8వ జాతీయ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఐటీబీపీ జవాన్లు యోగా ఆసనాలను ప్రదర్శించారు.

Advertisement

అయితే ఆక్సిజన్ లేకుండా, సరిగ్గా నీరు కూడా లభించని చోట యోగాసనాలు వేయడం గమనార్హం. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను చూస్కే మీరు కూడా వావ్ అంటారు. లోహిత్ పుర్ లోని ఏటీఎస్ ప్రాతంంలో అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు కొన వద్ద ఉ్నన హిమ్ మీర్లు గుర్రాలతో యోగా సాధన చేశారు. కాగా 2015 నుంచి ప్రతీ యేటా జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రంపంచంలోని పలు ప్రాంతాల్లో సామూహికంగా యోగా సాధన చేస్తారు.

Advertisement

Advertisement