Andhra apples: యాపిల్ అంటే ఒకప్పుడు కశ్మీర్ నుంచి మాత్రమే వచ్చేవి . అంతేనా ప్రియురాళ్లను, హీరోయిన్ల అందాలను పొగిడేందుకు అందరూ కశ్మీర్ యాపిల్ లా ఉన్నావని చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్రా యాపిల్ లా ఉన్నావని పొగడాల్సిన తరుణం వచ్చేసింది. అందుకు కారణం… ఆంధ్రాలోనూ యాపిల్స్ ను పండిస్తున్నారు. రుచిలోనూ వాటికి మించినవి లేకపోవడంతో చాలా మంది వీటిని తినేందుకు తెగ ఇష్టపడుతున్నారు. అయితే ఈ యాపిల్స్ రంగులోనే కాదు.. ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ మంచి పేరును తెచ్చుకుంటున్నాయి. వీటికి తోడు ఆ రుచే వేరు అనేంత కమ్మగా ఉంటున్నాయి. ఒకసారి వాటి రుచి చూశారంటే… తరచూ వాటిని కొని తెచ్చుకుంటారు.
పర్యాటక ప్రాంతమైన అరుకు, లంబసింగి ప్రాంతాల్లో ఇప్పుడు యాపిల్ తోటల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. యాపిల్ సాగులో ఒక్కో మొక్కకు నుంచి యాపిల్స్ విరగ గాసిన దృశ్యాలు ప్రకృతి ప్రియులను కనివిందు చేస్తున్నాయి. కెంపయిన రంగుతో, ఇంపయిన సైజుతో, ఊరించే రుచులతో ఆకర్షిస్తున్న ఈ యాపిల్స్ లంబసింగి కొత్త అందాలను దిద్దుతున్నాయి. మఖ్యంగా చింతపల్లి, జీకే వీధి మండలాల్లో గిరిజన రైతులు సాగు చేస్తున్న యాపిల్ మొక్కలకు చెట్టు నిండా కాయలు కాస్తున్నాయి.
గతంలో ఒక్కొక్క మొక్క నుంచి ఐదు, ఆరు కాయలు రాగా… ఈ ఏడాది సంఖ్య కు దాటి కొన్ని చోట్ల పెరిగింది అంటున్నారు. అరకు, జీకే వీధి, చింతపల్లి మండలాల్లో యాపిల్ సాగ్ ఆశాజనకంగా ఉంటుందని అధికారులు అంటున్నారు. తాజాగా మాడెం గ్రామంలో ఓ రైతు పంట పొలంలో ఒక్కో చెట్టుకు 20 నుంచి 30 కాయలు వచ్చాయి. దీంతో చాలా మంది ఈ ఆంధ్రా యాపిల్ కాయలు పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.