...

Business idea: పచ్చళ్ల బిజినెస్‌.. నెలకు రూ.30 వేల ఆదాయం పక్కా!

Business idea: ప్రతి ఒక్కరికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఉండాలని ఆర్థిక శాస్త్ర నిపుణులు పదే పదే చెప్పే మాట. ఎందుకంటే అనుకోని కారణాల వల్ల ఒక ఆదాయం ఆగి పోయినా.. జీవితం సాఫీగా సాగేందుకు, మరో మార్గం నుంచి ఆదాయం ఆదుకుంటుందని నిపుణులు భావన. అలాగే చాలా మందికి ఏదో ఒక వ్యాపారం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ సరైన ఆలోచన లేక ముందుకు అడుగు పడదు. మరికొందరికి ఐడియాలు ఉన్నా ఆదాయం సరిపోదు. ఇప్పుడు చెప్పే ఐడియా అటు చేసే ఉద్యోగం చేస్తూనే, ఈ వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు.

Advertisement

Advertisement

తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందాలనుకునే వాళ్లు ఈ ఐడియాని ఫాలో అవ్వొచ్చు. పైగా ఈ వ్యాపారం చేయడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా మార్చొచ్చు. అతి తక్కువ పెట్టుబడి పెట్టి మంచి ఆదాయం పొందవచ్చు. చాలా మందికి రోజూ పచ్చడి లేనిదే ముద్ద దిగదు. కూర ఏదైనా పచ్చడి మాత్రం పక్కాగా ఉండాల్సిందే. పైగా ఇది పచ్చళ్ల సీజన్. దానినే ఒక వ్యాపారంగా మల్చుకోవచ్చు. పచ్చళ్లను రుచికరంగా చేయగలిగితే చాలు.. వ్యాపారం సగం సక్సెస్‌ అయినట్టే. మంచి రాబడి కూడా పొందవచ్చు. కేవలం పది, 15 వేల రూపాయలతో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. రాబడి పచ్చళ్ల రుచిపై ఆధారపడి ఉంటుంది. ఎంతలేదన్న నెలకు రూ. 30 వేలు పక్కా వస్తాయి.

Advertisement

వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆత్మనిర్బర్ భారత్ మిషన్ సహాయం చేస్తుంది. అయితే బిజినెస్ ప్రారంభించాలంటే కొంత స్థలం ఉండాలి. 900 చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది. కొంచెం ఓపెన్ స్పేస్ ఉండాలి. పచ్చళ్లు తయారు చేయడానికి, ఎండబెట్టడానికి, ప్యాకింగ్ చేయడానికి అవసరం పడుతుంది. ఎక్కువ కాలం పచ్చళ్లు పాడైపోకుండా ఉంచాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదట్లో మార్కెటింగ్ కొంత ఇబ్బంది పెట్టొచ్చు. ఓపికగా ఎదురుచూస్తూ నాణ్యత, రుచి ఉంటే క్రమంగా వినియోగదారులు పెరుగుతారు.

Advertisement
Advertisement