Serial actress vaishnavi: ప్రముఖ సీరియల్ నటి.. దేవత ఫేమ్ వైష్ణవి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తన పెళ్లి వేడకకు సంబంధించి ఎప్పటికప్పుజు తన యూట్యూబ్ థానెల్ లో వరుస వీడియోలను షేర్ చేస్తూ.. ఉంటుంది. నిశ్చితార్థం మొదలు.. షాపింగ్, రిటర్న్ గిఫ్టులు, ఐదు రోజుల పెళ్లి వేడుక ఇలా అన్ని వీడియోలను తన అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం ఈమె పెళ్లి వీడియో మిలియన్ల వ్యూస్ ను కొల్లగొడుతోంది. మే నెల 25వ తేదీ బుధవారం 9.19 నిమిషాలకు శంషాబాద్ లో వైష్ణవి వివాహం ఘనంగా జరిగింది. కరీంనగర్ కి చెందిన సురేష్ కుమార్ తో ఆమె పెళ్లి కన్నుల పండువగా సాగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు.
అయితే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ డైరెక్టర్ సురేష్ ని.. వైష్ణవి ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కలకలం పిల్లా పాపలతో సంతోషంగా కలిసి ఉండండంటూ ఆశీర్వదిస్తున్నారు.