Samantha : డిజైనర్ తో కలిసి డేట్ నైట్ వెళ్లిన సమంత.. వైరల్ అవుతున్న ఫోటోలు?

Updated on: June 3, 2022

Samantha : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నటి సమంత ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా మరోవైపు యశోద సినిమా షూటింగ్ తో ఎంతో బిజీగా ఉన్నారు.ఇదివరకే ఖుషి సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈమె ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఇక ఈమెతో పాటు ఈమె స్నేహితులు సాధన సింగ్, ప్రీతమ్ కూడా తనతో పాటే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా యశోద సినిమా షూటింగ్ పేకప్ చెప్పిన తర్వాత వీరిద్దరితో కలిసి సమంత డేట్ నైట్ వెళ్లినట్లు తెలుస్తోంది.

Samantha
Samantha

నటుడు నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండగా ఉన్నఫలంగా వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకులు తీసుకున్న తర్వాత సమంత పూర్తిగా తన వ్యక్తిగత జీవితాన్ని తనకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. తన స్నేహితులతో కలిసి ఇష్టమైన ప్రదేశాలకు వెళుతూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఇకపోతే తాజాగా ఈమె సాధన సింగ్, ప్రీతమ్ తోకలిసి డేట్ నైట్ వెళ్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఎరుపు రంగు దుస్తులను ధరించి సమంత ఎంతో అందంగా కనబడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

ఈ విధంగా ప్రీతమ్ తో కలిసి సమంత డేట్ నైట్ వెళ్లడంతో అక్కినేని అభిమానులు మరోసారి ఈమె వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. గతంలో నాగచైతన్య సమంత విడిపోవడానికి కారణం ప్రీతమ్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేసిన సంగతి మనకు తెలిసిందే. అతనితో సమంత చనువుగా ఉండటం వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విధంగా సమంత, ప్రీతమ్ గురించి ఇలాంటి వార్తలు చెక్కర్లు కొట్టినప్పటికీ ఈమె మాత్రం వాటిని పట్టించుకోకుండా తనతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Read Also : Samantha : పెళ్లి కూతురు గెటప్ లో సామ్.. అదిరిపోయేలా ఉందంటూ కామెంట్లు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel