Samantha, Naga chaithanya: సమంత, చై మళ్లీ ఒక్కటికాబోతున్నారా.. నిజమేనంటున్న సామ్ పోస్ట్!

Samantha, Naga chaithanya: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగ చైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన వీరిద్దరూ ప్రేమించుకోవడం, ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్ల తర్వాత విడాకులు తీస్కోవడం అందరికీ తెలుసు. వీరి విడాకులు తర్వాత వీరి మీద ఎన్నెన్నో వార్తలు వచ్చాయి. వాళ్లు విడిపోవడానికి కారణాలివే అంటూ. కానీ ఇప్పుడు మళ్లీ వాళ్లు కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏంటీ సమంత, నాగ చైతన్య నిజంగానే కలవబోతున్నారా అని అనుమానం వస్తుందా. అవును కలిసే అవకాశం కూడా ఉంది. ఇటీవలే విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన ధనుష్, ఐశ్వర్యలు.. విడాకులు తీస్కోకుండానే కలిసిపోయినట్లు వీరు కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు చాలా మంది. అయితే తాజాగా సామ్ చేసిన ఓ పోస్ట్ చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది.

Advertisement

ఒంటరితనంపై సామ్ చేసిన ట్వీట్ చూస్తుంటే ఏదో మిరాకిల్ జరిగే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. నువ్వు ఎప్పుడూ ఒంటరిగా నడవలేవు అనే అర్థం వచ్చేలా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో అనేక చర్చలకు తావిస్తోంది. చైతన్య గురించి ఆమె ఈ పోస్ట్ పెట్టిందని చాలా మంది అనుకుంటున్నారు. ఏది ఏమైతేనేం.. వారిద్దరూ కలిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఏం జరగనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel