Bandla ganesh : యాంకర్ సుమ యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతశయోక్తి కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఆమెను అందరూ ఆరాధిస్తారు. ఆమె చేసే ప్రోగ్రాంలను చూసేందుకు తెగ ఇష్టపడుతుంటారు. అయితే ఆమె కేవలం తన అందం, అభినయంతోనే కాదండోయ్ స్పాంటేనియస్ తో నెంబర్ వన్ గా ముందుకు దూసుకుపోతుంది. అయితే ప్రేక్షకుల్ని అంతగా అలరించే సుమ వయసు, అందం మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తన మీద తానే సెటైర్లు వేస్కుంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే వచ్చే వారం ప్రసారం కాబోయే క్యాష్ ఎపిసోడ్ కు డేగల బాబ్జీ టీం వచ్చింది. బండ్ల గణేష్, సమీర్, జోష్ రవి, డైరెక్టర్ వచ్చారు.
అయితే బండ్ల గణేష్ కు కోళ్ల ఫారాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ షోలో భాగంగా టామాటాల రేటు ఎంతని సుమ… బండ్లన్నను అడగగా అవన్నీ మాకు తెలియవు.. కోడిగుడ్డ ధర ఎంతో అడగండి చెబుతాం అంటాడు. ఇది విన్న వారందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. ఇందుకు సుము మీపు పంపే గుండ్లతోనే అందరం తింటున్నానం అని అనగా… అవును మరి కోడిగుడ్డు లేకపోతే జీవితం లేదంటూ బండ్లన్న వివరిస్తాడు. అలాగే ఆ కోడి గుడ్లు తినే ఇంత అందంగా తయారయ్యావ్ అని చెప్తాడు.
వెంటనే సమీర్… ఇన్నాళ్లకు సుమ అందానికి రహస్యం తెలిసింది… కోడి గుడ్లన్న మాట అంటూ సమీర్ కౌంటర్ వేస్తాడు. ఈరోజు అద్దంలో చూసుకుంటే నాకు నేను కోడిలా కనిపిస్తానా అని సము తన మీద తానే సెటైర్ వేసుకుంటుంది. దీంతో బండ్గ గణేష్, సమీర్ పగలబడి నవ్వేస్తారు.
Read Also : Jabardasth Promo : వాడు నిన్నేం చేస్తాడులే.. అయ్యో.. అజర్ పరువు తీసిందిగా రీతూ.. వీడియో..!