...

Health remedy: ఈ ఒక్క ఆకు అనే రకాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది

Health remedy: కీళ్ల నొప్పులు అనేది ఇప్పుడు చాలా మందిలో వస్తున్న సమస్య. యువతలోనూ ఈ సమస్య తలెత్తుతోంది. పెద్ద వారిలో అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే కీళ్ల నొప్పులు లేని వారు ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తున్నారు. నొప్పుల సమస్య చాలా మందిని వేధిస్తున్నా దానికి సరైన పరిష్కారం మాత్రం దొరకట్లేదని చెప్పాలి. ఆస్పత్రుల వెంట తిరిగినా… వైద్యులను తరచూ కలుస్తూ రకరకాల మందులు వాడినా ఫలితం మాత్రం ఉండటం లేదు.

Advertisement

Advertisement

ఈ నొప్పుల నుండి బయట పడాలంటే ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలా బాగా పని చేస్తుంది. రాత్రి వేళ 3 బిర్యానీ ఆకులను తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. బిర్యానీ ఆకుల ముక్కలను ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆకు ముక్కలను నానబెట్టాలి. మరుసటి రోజు ఈ నీటిలో అరస్పూన్ సొంపు వేసి పొయ్యిపై పెట్టి మరిగించాలి. ఐదు నుండి ఏడు నిమిషాల వరకు మంచిగా మరగబెట్టాలి.

Advertisement

బాగా మరిగిన ఆ నీటిని వడకట్టి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. ఈ నీటిని తాగితే కీళ్ల నొప్పులు, మొకాళ్ల నొప్పులు, అధిక బరువు వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికి ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతుంది. నిద్ర లేమి సస్య ఉన్న వారు ఈ నీటిని రాత్రి పడుకోవడానికి 30 నిమిషాల ముందు తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

Advertisement
Advertisement