Sarkaru Vaari Paata Movie Review : మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత రెండున్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ విడుదల తర్వాత ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించి.. ఎప్పడెప్పుడు సినిమా విడుదల అవుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
మహి(మహేష్ బాబు) వడ్డీ వ్యాపారి. చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల కారణంగా డబ్బు అంటే చాలా సీరియస్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. తాను ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ డబ్బును వసూళ్లు చేసుకునేందుకు ఎంత దూరం అయినా వెళ్తాడు. కొన్ని కారణాల వల్ల యూఎస్ లో ల్యాండ్ అయిన మహి కి కళావతి (కీర్తి సురేష్) పరిచయం అవుతుంది. ఆమె చదువు కోసం అంటూ చాలా డబ్బు మహి నుండి అప్పుగా తీసుకుంటుంది. ఆమె ప్రేమలో పడ్డ మహి అడిగినంత డబ్బు ఇస్తూ ఉంటాడు. మరో వైపు వ్యాపారవేత్త రాజేంద్రనాథ్ (సముద్రఖని) తో మహి కి గొడవ. ఒక చిన్న గొడవ కాస్త చాలా పెద్దగా దారి తీస్తుంది. రాజేంద్రనాథ్ పెద్ద స్కామ్ ను మహి బయట పెడతాడు. ఇంతకు సముద్ర ఖని ఎవరు? మహి చిన్నప్పుడు జరిగిన పరిస్థితులు ఏంటీ? అనే విషయాలను తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే.
నటీ నటుల నటన :
సూపర్ స్టార్ మహేష్ బాబు నటన అదిరిపోయింది. గత కొన్ని రోజులుగా అభిమానులు మాట్లాడుకుంటున్నట్లుగా వింటేజ్ మహేష్ బాబును ఈ సినిమాలో చూసినట్లుగా అనిపించింది. మహేష్ బాబు మాస్ డైలాగ్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో ఎనర్జి సూపర్. ఇక ఆయన మమ మహేష తో పాటు కళావతి పాటల్లోని డాన్స్ లతో అభిమానులకు కన్నుల విందు చేశాడు. కామెడీ టైమింగ్ లో కూడా సూపర్. ఇక హీరోయిన్ కీర్తి సురేష్ కు లిమిటెడ్ పాత్ర దక్కింది. అయినా కూడా ఉన్నంతలో అందంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె పాటల్లో చాలా అందంగా కనిపించి మెప్పించింది. మమ మహేష పాటలో మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. విలన్ గా ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి పేరు దక్కించుకున్న సముద్రఖని ఈ సినిమా తో మరోసారి మెప్పించాడు. ఇంకా సినిమాలో కనిపించిన ఇతర నటీ నటులు వారి వారి పాత్రల పరిధిలో నటించి ఆకట్టుకున్నారు.
టెక్నికల్ :
కళావతి మరియు మమ మహేష సాంగ్ సినిమా విడుదలకు ముందే మంచి సక్సెస్ అయ్యాయి. సినిమాలో ఆ పాటలు వచ్చే సమయంలో అభిమానుల కేరింతలతో థియేటర్ దద్దరిలింది. మహేష్ బాబు మాస్ స్టామినాకు తగ్గట్లుగా థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్రోత మోగించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సినిమాట్రగఫీ మ్యాజిక్ చాలా బాగా పని చేసింది. దర్శకుడు పరశురామ్ మెప్పించాడు. ఆయన స్క్రీన్ ప్లే బాగుంది. డైలాగ్స్ తో కూడా మెప్పించాడు. ఎడిటింగ్ విషయంలో అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు జరిగినట్లుగా అనిపించినా ఓవరాల్ గా పర్వాలేదు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. కథానుసారంగా కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారు.
ప్లస్ పాయింట్స్ :
మహేష్ బాబు,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్,
స్క్రీన్ ప్లే,
కీర్తి సురేష్.
మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్,
సెకండ్ హాఫ్,
ప్రీ క్లైమాక్స్.
విశ్లేషణ :
మహి అనే పాత్ర చిన్నప్పుడు పడ్డ కష్టాలను.. పెద్దయ్యాక పట్టుదలగా వ్యవహరించిన తీరును దర్శకుడు పరశురామ్ విభిన్నంగా చూపించడంలో సఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడిలో పట్టు కనిపించింది. డైలాగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మహేష్ బాబును మాస్ మరియు క్లాస్ అభిమానులు చూడాలనుకునే కోణంలో చూపించి అదరగొట్టాడు. కీర్తి సురేష్ మరియు మహేష్ బాబు మద్య ఉండే సన్నివేశాలు ఎంటర్ టైన్మెంట్ ను పండించాయి. ఒక రకంగా చెప్పాలంటే పోకిరి సినిమాను దూకుడు సినిమాను గుర్తు చేశాయి అనడంలో సందేహం లేదు. మహేష్ బాబు నుండి మంచి అభిమానులు ఆశించిన మాస్ ఎలిమెంట్స్ ను ఇవ్వడంలో పరశురామ్ సూపర్ సక్సెస్ అనవచ్చు. అభిమానులకు విందు భోజనం. కాని సెకండ్ హాప్ లో కథ కాస్త స్లో అయ్యింది.. అది కాకుండా కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లుగా ఉన్నాయి. ఓవరాల్ గా సర్కారు వారి పాట ఫ్యాన్స్ కు పండుగే.
రేటింగ్ : 3.0/5.0
Read Also : Mahesh babu: సినిమాల్లోకి సితారా… అసలు విషయం చెప్పేసిన సూపర్ స్టార్!