Viral video: వెర్రి వేయి రకాలు అంటారు. అందులో ఇదొకటి అనిపించేలా చేసిందో జంట. అయితే ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ వేడుకలో ఏదో కొత్త ప్రయోగం చేసి దాన్ని సోషల్ మీడియా ద్వారా పది మందికి చేరవేడయం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది. ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ, మెహందీ, సంగీత్… ఇలా పలు రకాల కార్యక్రమాలను గ్రాండ్ గా చేస్కుంటున్నారు. ముఖ్యంగా వెడ్డింగ్ షూట్ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో ప్రకారం… పెళ్లి వేడుక ముగిసిన తర్వాత నూతన దంపతులు తమ గ్రామానికి కారులో వెళ్తున్నారు.
అయితే వారికి హఠాత్తుగా ఏమైందో.. మార్గ మధ్యంలో కారు దిగి ఎండలో పరిగెత్తడం ప్రారంభించారు. ఎర్రటి ఎండలో పెళ్లి దుస్తుల్లోనే పోటా పోటీగా పరిగెట్టారు. మరి ఇది వెడ్డింగ్ షూట్ కోసం చేశారా… సరదాగా చేశారా తెలియదు కానీ ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.