Viral Video: ఈ ఎద్దు మామూలుది కాదు.. పులినే పరుగులు పెట్టించింది!

Viral Video: అడవిలో భయంకరమైన జంతువులు అనగానే పులులు, సింహాలు, తోడేళ్లు గుర్తుకు వస్తాయి. మిగతా జంతువులు ఏవైనా వీటిని చూడగానే పరుగులు లంకించుకుంటాయి. వీటి అలికిడి వినగానే అల్లంత దూరానికి పరుగెడతాయి. వాటి కంట ఎక్కడ పడతామోనని నిత్యం అప్రమత్తంగా ఉంటాయి. మిగతా జంతువులు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. పులులు, సింహాలు.. మాటు వేసి మరీ అడవి జంతువులను మట్టు బెడతాయి. అయితే ఒక్కోసారి మిగతా జంతువులు ఈ మాంసాహార జంతువులను పరిగెత్తించే వీడియోలను చూసే ఉంటారు. అమాయక జంతువులు సైతం ఒక్కోసారి సింహాలను, పులులను ఎదుర్కొంటాయి.

అచ్చంగా అలాంటి వీడియోనే ఇది. మామూలుగా పులులను, సింహాలను అంత దూరంలో చూడగానే ఎద్దులు తప్పించుకుని పరుగెడతాయి. కానీ ఎద్దులు కోపంలో ఉన్నప్పుడు సింహాలను వాటి కొమ్ములతో అంతెంతు పైకి లేపి పడేసే వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇక్కడ మాత్రం ఆ ఎద్దు అలాంటి పని చేయలేదు. ఏం చేసిందంటే.. ఓ ఎద్దు రోడ్డుపై పరుగెట్టుకుంటూ వస్తోంది. వేగంగా వస్తున్న ఆ ఎద్దును వేటాడాలని పక్కనే పొదల్లో ఉన్న పులి మాటు వేసి కూర్చుంది. ఎద్దు దగ్గరికి రాగానే ఒక్క సారిగా పైకి లేచి ఎద్దుపైకి దూకడానికి ప్రయత్నించగానే ఆ ఎద్దు పులి వేసిన పథకాన్ని గమనించింది. తన కొమ్ములతో పొడిచేందుకు పులి పైకి వేగంగా వచ్చింది. దాంతో ఆ పులి జడుసుకుని అక్కడి నుండి పరుగో పరుగు అంటూ పారిపోయింది.

Advertisement

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel