Manchu Lakshmi: బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన లక్ష్మీ మంచు… ఆచార్య సినిమా పోయిందనే కదా అంటూ నెటిజన్ కామెంట్స్!

Updated on: May 2, 2022

Manchu Lakshmi : మంచు లక్ష్మి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మోహన్ బాబు కూతురుగా, నటిగా అందరికీ సుపరిచితమైన మంచు లక్ష్మి ఇప్పటికీ పలు సినిమాల ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇక ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే మంచులక్ష్మి నిత్యం సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తన కూతురుతో కలిసి మంచు లక్ష్మి బుల్లెట్ బండి పాటకు డాన్స్ చేశారు.

lakshmi-manchu-do-dance-for-bullet-bandi-netizen-comments-that-because-of-acharya-movie-flop
lakshmi-manchu-do-dance-for-bullet-bandi-netizen-comments-that-because-of-acharya-movie-flop

నైట్ డ్రెస్సులో తన కూతురుతో కలిసి బుల్లెట్ బండికి డాన్స్ చేసిన వీడియోని మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అంతర్జాతీయ డాన్స్ దినోత్సవం కావడంతో ఇక్కడ మేము డాన్స్ చేసాము అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.మంచు లక్ష్మి ఎంతో అద్భుతంగా డాన్స్ చేసింది అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు నీలో ఇంత అద్భుతమైన డాన్సర్ ఉన్నారని ఊహించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

Advertisement

ఇలా ఈమె చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇకపోతే మరి కొంత మంది నెటిజన్లు నిజం చెప్పు… ఆచార్య సినిమా పోయిందనే కదా కుటుంబం మొత్తం ఇలా డాన్సులు చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. ఆచార్య సినిమా విడుదలైన మొదటి రోజే విష్ణు చేస్తూ అలిసిపోయాను అంటూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మి కూడా డాన్స్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతో మంది నెటిజన్లు వీరి డాన్స్ వీడియో ని ఆచార్య సినిమాకి ముడిపెడుతూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మంచు లక్ష్మి డాన్స్ వీడియోతో పాటు నెటిజన్ల కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Acharya Flop : ‘ఆచార్య’ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌.. ప్లాప్‌‌కు ఆ నాలుగు కారణాలు..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel