Nagababu: మంత్రి పదవులు రాని, రాజీనామా చేసిన వైసీపీ నేతలపై సెటైర్లు వేసిన నాగబాబు… భారీగా ట్రోల్ చేస్తున్న వైసీపీ అభిమానులు!

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ అధికారులపై తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ విమర్శలు చేస్తుంటారు. ఇలా నాగ బాబు చేసిన ట్వీట్స్ పలు వివాదాలకు కారణమవుతుంటాయి. ఇక తాజాగా వైసీపీ ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే కొందరు మంత్రులను తొలగించి కొత్తవారికి అవకాశం కల్పించారు.అయితే ఈసారైనా మంత్రి పదవి దక్కుతుందని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కొందరికీ జగన్ ప్రభుత్వం నుంచి చేదు అనుభవం ఎదురవడంతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ విషయం పై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా చేసిన ట్వీట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవులు రానీవారు, మంత్రి పదవులు పోయినవారి బాధ, ఆవేదన చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మరికొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. వారిని చూస్తే అయ్యో పాపం అనిపించిందంటూ నాగబాబు వైసీపీ నేతల పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

అయితే వీరందరూ బాధపడి ఏడ్చే ముందు ఒక విషయం గుర్తు పెట్టుకోండి.ఎంతోమంది కౌలు రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువత, అనేక చేతి వృత్తి కళాకారులు, మౌలిక వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారందరికీ గురించి తలుచుకుని కొద్దిగా బాధ, కన్నీళ్లు పెట్టుకోవడం, కుమిలిపోవడం వంటివి చేస్తే ఇంకా బాగుంటుంది. ఏమంటారు వైసీపీ లీడర్స్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అంటూ నాగబాబు ట్విట్టర్ ద్వారా వైసీపీ నేతల పై సెటైర్లు వేశారు. ఈ క్రమంలోనే వైసీపీ అభిమానులు స్పందిస్తూ ఎవరైనా ఏదైనా మాట్లాడే ముందు ఆ మాటలు మాట్లాడటానికి మనకు అర్హత ఉందో లేదో తెలుసుకుని మాట్లాడాలని,మీ అన్న మాదిరి గౌరవంగా బతకడం నేర్చుకో అంటూ నాగబాబు వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నాగబాబు ట్వీట్ వల్ల వైసీపీ, జనసేన అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel