...

Allu Arjun: భ్యార పిల్లలతో కలసి అక్కడ పుట్టిన రోజు జరుపుకుంటున్న బన్నీ!

Allu Arjun: అల్లు అర్జున్ నటించిన భీష్మ సినిమా ఇటీవల విడుదలై జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ వైవిధ్యమైన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. పుష్ప సినిమా థియేటర్ల వద్ద భారీ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా మంచి హిట్ అవటంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏప్రిల్ 8 వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన పుట్టిన రోజును జరుపుకోవటానికి కుటుంబ సభ్యులు భార్య పిల్లలతో కలిసి సెర్బియా లో వాలిపోయారు.

Advertisement

పుష్ప సినిమా ఘన విజయం సాధించిన తర్వాత వచ్చిన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ ఫుల్ ఖుషీగా తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఈరోజుతో బన్నీ 39 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా బన్నీ అభిమానులందరూ విషెస్ తెలియచేశారు. అంతే కాకుండాతమ అభిమాన హీరో పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేయటానికి అభిమానులందరూ సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టు సినిమాలో నటించనున్నాడు. పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో భారీ స్థాయిలో ఫైటింగ్ సీన్లు ఉండనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రష్మిక కథానాయిక పాత్ర పోషించగా.. దిశా పటాని స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. పుష్ప టు సినిమా కి అల్లు అర్జున్ ప్రత్యేకంగా పారితోషికం తీసుకోకుండా హిందీ వెర్షన్ షేర్ ను మాట్లాడుకున్నట్టుగా సినీ వర్గాల సమాచారం. ఈ లెక్కతో బన్నీకి వచ్చే పారితోషికంకన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది.

Advertisement
Advertisement